ప్రముఖ సింగర్ కన్నుమూత
ప్రముఖ సింగర్ శారదా సిన్హా కన్నుమూశారు. ఈ విషాద వార్తను ఆమె కుమారుడు ధృవీకరించారు.
By అంజి Published on 6 Nov 2024 6:13 AM GMTప్రముఖ సింగర్ కన్నుమూత
ప్రముఖ సింగర్ శారదా సిన్హా కన్నుమూశారు. ఈ విషాద వార్తను ఆమె కుమారుడు ధృవీకరించారు. అన్షుమాన్ సిన్హా మాట్లాడుతూ ఛత్ పూజ మొదటి రోజున ఆమె మరణించిందంటూ తెలిపారు. కుటుంబ సభ్యులకు, ఆమెను ప్రేమించిన వారందరికీ ఈ బాధాకరమైన విషయాన్ని పంచుకుంటున్నామన్నారు. బుధవారం పాట్నాలో అంత్యక్రియలను నిర్వహించనున్నారు.
బీహార్‌కు చెందిన జానపద దిగ్గజం శారదా సిన్హా నవంబర్ 5న మరణించారు. ఆమె 2018 నుండి మల్టిపుల్ మైలోమా అనే బ్లడ్ క్యాన్సర్‌తో పోరాడుతున్నారు. శారదా సిన్హా అంతిమ సంస్కారాలు భర్త అంత్యక్రియలు జరిగిన ప్రదేశంలోనే జరగాలని నిర్ణయించుకున్నారు.
శారదా సిన్హా చివరి ప్రీ-రికార్డ్ పాట, దుఖ్వా మితయిన్ ఛతీ మైయా నవంబర్ 4న విడుదలైంది. శారదా సిన్హాను 'బీహార్ కోకిల' అని ముద్దుగా పిలుస్తారు. భోజ్‌పురి, మైథిలి, మగాహి సంగీతానికి ఆమె అపారమైన కృషి చేశారు. బీహార్ సంప్రదాయ సంగీతాన్ని మరింత మందికి దగ్గర చేయడంలో ఆమె కీలకపాత్ర పోషించారు. ఆమె అత్యంత ప్రజాదరణ పొందిన పాటలలో కెల్వా కే పాట్ పర్ ఉగలన్, హే ఛతీ మైయా, హో దీనానాథ్, బహంగీ లచకత్ జాయే, రోజే రోజే ఉగేలా, సునా ఛతీ మాయ్, జోడే జోడే సుపావా, పాట్నా కే ఘాట్ పర్ ఉన్నాయి. ఆమెకు 2018లో పద్మభూషణ్ అవార్డు ఇచ్చారు.