తండ్రైన సింగర్ రేవంత్.. సంబరాలు మొదలు
Singer Revanth Blessed Baby Girl.బిగ్‌బాస్ టైటిల్ గెలవకముందే రేవంత్ ఇంట
By తోట వంశీ కుమార్ Published on 2 Dec 2022 9:58 AM ISTసింగర్‌గానే కాకుండా బిగ్‌బాస్ తెలుగు సీజన్ 6లో కంటెస్టెంట్‌గా తన ఆటతో అందరి మనసులను గెలుచుకున్నాడు రేవంత్. బిగ్‌బాస్ టైటిల్ గెలవకముందే రేవంత్ ఇంట సంబరాలు మొదలు అయ్యాయి. రేవంత్ భార్య అన్విత రెడ్డి గురువారం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని రేవంత్ సన్నిహితులు సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. దీంతో నెటీజన్లు ఈ దంపతులిద్దరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
రేవంత్ బిగ్‌బాస్‌లోకి అడుగుపెట్టే సమయానికి అన్విత గర్భిణి. రేవంత్ హౌస్‌లో ఉన్న సమయంలోనే ఆమె సీమంతం కూడా జరిగింది. ఆ వీడియోను చూసిన రేవంత్ చాలా ఎమోషనల్ అయ్యాడు. చిన్నప్పటి నుంచి తండ్రి లేని లోటు తనకు తెలుసునని, అందుకే ఎప్పుడెప్పుడు నాన్న పిలిపించుకోవాలా అని ఎదురుచూస్తున్నట్లు ఇప్పటికే రేవంత్ పలుమార్లు చెప్పాడు. మరీ బిగ్‌బాస్ ఈ విషయాన్ని రేవంత్ కు చెబితే అతడి ఆనందానికి అవధులు ఉండవని అంటున్నారు అతడి అభిమానులు.
ఇదిలా ఉంటే.. బిగ్‌బాస్ టైటిల్ విన్నర్ అయ్యే అవకాశం రేవంత్ కే ఉందని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.