నటుడిపై సింగర్ ఆరోపణలు.. వద్దన్న వినలేదు..ముద్దులు పెడుతూ అసభ్యంగా తాకుతూ
Singer Lisa Gentile accuses actor Chris Noth.ప్రముఖ హాలీవుడ్ సీనియర్ నటుడు క్రిస్ నోత్ గురించి ప్రత్యేకంగా
By తోట వంశీ కుమార్ Published on 25 Dec 2021 11:13 AM ISTప్రముఖ హాలీవుడ్ సీనియర్ నటుడు క్రిస్ నోత్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 'సెక్స్ అండ్ ది సిటీ' సిరీస్ ద్వారా నటుడిగా ఎంత పేరు సంపాదించుకున్నారో.. అంతకంటే ఎక్కువగా లైంగికంగా వేధించాడు అంటూ చెడ్డపేరు తెచ్చుకున్నారు. ఇప్పటికే ముగ్గురు మహిళలు.. క్రిస్‌నోత్ తమను లైంగికంగా వేధించాడంటూ కేసు పెట్టగా.. తాజాగా సింగర్ లీసా జెంటిల్ కూడా క్రిస్ నోత్‌పై సంచలన ఆరోపణలు చేసింది. తనను అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఈ ఘటన 2002లో జరిగిందని.. కానీ ఈ విషయాన్ని బయటపెడితే తన కెరీర్ నాశనం చేస్తానని క్రిస్ బెదిరించినట్లు చెప్పుకొచ్చింది.
'1998లో న్యూయార్క్‌లోని ఓ రెస్టారెంట్‌లో క్రిస్‌ను తొలిసారి కలిశాను. సంగీతం, బిజినెస్ గురించి మాట్లాడుకునేవాళ్లం అలా మా మధ్య స్నేహాం మొదలైంది. 2002 సంవత్సరం ప్రారంభంలో ఓరోజు రాత్రి అతడు నన్ను రెస్టారెంట్ నుంచి ఇంటిదగ్గర దింపుతానన్నాడు. సరే అనడంతో అతడు ఇంటిదగ్గర డ్రాప్ చేశాడు. ఇల్లు చూస్తానంటూ లోపలికి వచ్చాడు. వెంటనే నన్ను బలవంతంగా దగ్గరకు లాక్కుని నా బాడీ పార్ట్స్‌పై ముద్దులు పెడుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. నేను వద్దని.. అతడిని ఆపేందుకు ప్రయత్నించగా.. అతడు మరింతగా రెచ్చిపోయాడు. నా చేతును ఆయన చొక్కాలోపలకు పోనిచ్చాడు. ప్యాంటు తీయడానికి ప్రయత్నించాడు. నా శక్తినంతా ఉపయోగించి అతడిని నెట్టివేశాను. నాకు ఇదంతా ఇష్టం ఉండదు అంటూ గట్టిగా అరుస్తూ చెప్పాను. క్రిస్ నన్ను నోటికొచ్చినట్లు తిట్టాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే.. నా కెరీర్‌ను నాశనం చేస్తానని బెదిరించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. నా కెరీర్ ఎక్కడ నాశనం అవుతుందోనని నేను భయపడి ఇన్నాళ్లు ఈ విషయాన్ని బయటకు చెప్పలేదు. అయితే.. ఇటీవల ముగ్గురు మహిళలు సైతం క్రిస్ నోత్ తమను లైంగిక వేదింపులకు గురి చేశాడని కేసు పెట్టడంతో.. నాకు ధైర్యం వచ్చింది. అందుకే ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాను' అని చెప్పింది. కాగా.. లిసా ఆరోపణలపై క్రిస్‌నోత్ స్పందించాడు. ఆమె చేసిన ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని చెప్పాడు.