ప్ర‌ముఖ సింగ‌ర్‌కు క‌రోనా.. బెడ్ పై నుంచి లేవలేకపోతున్నానంటూ

Singer Kousalya Tests Covid-19 positive.క‌రోనా మ‌హ‌మ్మారి మ‌రోసారి విజృంభిస్తోంది. సామాన్యులు, సెల‌బ్రెటీలు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 Jan 2022 5:16 AM GMT
ప్ర‌ముఖ సింగ‌ర్‌కు క‌రోనా.. బెడ్ పై నుంచి లేవలేకపోతున్నానంటూ

క‌రోనా మ‌హ‌మ్మారి మ‌రోసారి విజృంభిస్తోంది. దీంతో సామాన్యులు, సెల‌బ్రెటీలు అని తేడా లేకుండా అంద‌రూ ఈ మ‌హమ్మారి బారిన ప‌డుతున్నారు. ఇక టాలీవుడ్‌లో క‌రోనా క‌ల‌క‌లం రేపుతోంది. ఇప్ప‌టికే ప‌లువురు న‌టీన‌టులు ఈ మ‌హ‌మ్మారి బారిన ప‌డ‌గా.. తాజాగా సింగ‌ర్ కౌస‌ల్య‌కు కూడా ఈ మ‌హ‌మ్మారి సోకింది. ఈ విష‌యాన్ని ఆమె సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్లడించింది. ఈ మ‌హ‌మ్మారి త‌న‌ను తీవ్రంగా ఇబ్బంది పెడుతుంద‌ని.. క‌నీసం బెడ్‌పై నుంచి కూడా లేవ‌లేక‌పోతున్నానంటూ పోస్టు చేసింది.

'నాకు క‌రోనా పాజిటివ్ అని నిర్ధార‌ణ అయింది. ఈ మహమ్మారి ల‌క్ష‌ణాలు తీవ్రంగానే ఉన్నాయి. రెండు రోజుల నుంచి జ్వరంగా ఉంది. క‌నీసం బెడ్‌పై నుంచి కూడా లేవ‌లేక‌పోతున్నాను. ఇప్పుడు గొంతు నొప్పి మరింత ఇబ్బంది పెడుతోంది. నిన్న‌టి నుంచి మందులు తీసుకోవడం మొద‌లుపెట్టాను. త్వరలోనే ఈ వైరస్ ను ఓడించి మీ ముందుకు వస్తాను. ద‌య‌చేసి అంద‌రూ జాగ్ర‌త్త‌గా ఉండండి' అని ట్వీట్ చేసింది.

ఈ విష‌యం తెలుసుకున్న సినీ ప్రముఖులు, అభిమానులు ఆమె త్వ‌ర‌గా కోలుకోవాలంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక ఇప్ప‌టికే మెగాస్టార్ చిరంజీవి, శ్రీకాంత్, యానీ మాస్టర్ క‌రోనా బారిన ప‌డిన సంగ‌తి తెలిసిందే.

Next Story
Share it