సినీ ప‌రిశ్ర‌మ‌లో మ‌రో విషాదం.. సింగ‌ర్ బాంబా బాక్య క‌న్నుమూత‌

Singer Bamba Bakya passes away.ప్ర‌ముఖ కోలీవుడ్ సింగ‌ర్ బాంబా బాక్య శుక్ర‌వారం ఉద‌యం క‌న్నుమూశారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 Sep 2022 7:21 AM GMT
సినీ ప‌రిశ్ర‌మ‌లో మ‌రో విషాదం.. సింగ‌ర్ బాంబా బాక్య క‌న్నుమూత‌

సినీ ప‌రిశ్ర‌మ‌లో మ‌రో విషాదం చోటు చేసుకుంది. ప్ర‌ముఖ కోలీవుడ్ సింగ‌ర్ బాంబా బాక్య శుక్ర‌వారం ఉద‌యం క‌న్నుమూశారు. ఆయ‌న వ‌య‌స్సు 49 సంవ‌త్స‌రాలు. ఆయ‌న ఆక‌స్మిక మ‌ర‌ణానికి గ‌ల కార‌ణాలు ఇంకా తెలియ‌రాలేదు. కొన్ని త‌మిళ మీడియా సంస్థ‌లు మాత్రం ఆయ‌న గుండె పోటుతో మ‌ర‌ణించార‌ని అంటున్నాయి. సింగ‌ర్ బాంబా బాక్య మ‌ర‌ణం ప‌ట్ల ప‌లువురు కోలీవుడ్ సినీ ప్ర‌ముఖులు సోష‌ల్ మీడియా వేదిక‌గా సంతాపం తెలియ‌జేస్తున్నారు.

త‌మిళంలో ప‌లు చార్ట్ బ‌స్ట‌ర్ పాట‌లు పాడి, సింగ‌ర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు బాంబా బాక్య. 'రోబో 2.0' చిత్రంలో 'పుల్లినంగ‌ల్' సాంగ్‌తో చిత్ర‌ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగుపెట్టాడు. ఆ త‌ర్వాత 'స‌ర్కార్' చిత్రంలో 'సింతాంగ‌రం', పొన్నియిన్ సెల్వ‌న్‌లో 'పొన్నిన‌ది' వంటి ప‌లు పాట‌ల‌ను పాడాడు. ఇత‌ను ఎక్కువ‌గా ఏ.ఆర్ రెహామాన్ సినిమాల్లోనే పాడాడు. సినిమాల్లోకి రాక‌ముందు ఈయ‌న భ‌క్తి పాట‌లు ఆల‌పించేవారు.

"బాంబే ఆక‌స్మిక మ‌ర‌ణం బాధ క‌లిగించింది. ఈ బాధ‌ను, న‌ష్టాన్ని త‌ట్టుకునే శ‌క్తి ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు, స్నేహితుల‌కు ఇవ్వాల‌ని ప్రార్థిస్తున్నాను " అంటూ హీరో కార్తీ ట్వీట్ చేశారు.

సర్కార్‌లో 'సిమ్తాంగారన్' పాటను రూపొందించడానికి బాంబా బాక్యాతో కలిసి పనిచేసిన గీత రచయిత వివేక్ ట్వీట్ చేస్తూ, "గొప్ప గాయకుడు ఇక లేరు. పుల్లినంగల్ మన చెవుల్లో ఎప్పుడూ ప్రతిధ్వనిస్తుంది. ఆయనతో కలమే ఎన్ సిమ్తాంగరన్‌లో పనిచేయడం ఓ ప్రత్యేక అనుభవం." అంటూ రాసుకొచ్చారు.

Next Story