సింగర్ అరిజిత్ సింగ్ ఇంట్లో విషాదం

Singer Arijit singh mother passed away.ప్రముఖ బాలీవుడ్ సింగర్ అరిజిత్ సింగ్ ఇంట్లో విషాదం. ఆయన తల్లి అదితి సింగ్ మరణించారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 May 2021 12:16 PM GMT
Singer Arijit singh

ప్రముఖ బాలీవుడ్ సింగర్ అరిజిత్ సింగ్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తల్లి అదితి సింగ్ మరణించారు. ఇటీవలే కరోనా బారిన పడిన అరిజిత్ సింగ్ తల్లి కోలుకోలేకపోయారు. ఆమె చికిత్సకు స్పందించడం లేదని.. ఆమె తుదిశ్వాస విడిచారంటూ ఆసుపత్రి సిబ్బంది తెలిపింది.

అదితి సింగ్ వయసు 52 సంవత్సరాలు. మొదట కరోనా బారిన పడిన ఆమెకు సోమవారం పరీక్షలు చేయగా.. కరోనా నెగటివ్ అని వచ్చింది. అయితే ఆమెకు సెరిబ్రల్ స్ట్రోక్ తగలడంతో కన్నుమూశారు. బుధవారం రాత్రి 11 గంటల సమయంలో ఆమె కన్నుమూశారని ఆసుపత్రి సిబ్బంది అఫీషియల్ స్టేట్మెంట్ లో తెలిపింది.

బాలీవుడ్ లో ఎన్నో హిట్ సాంగ్స్ పాడిన అరిజిత్ సింగ్ కు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఈతరం సింగర్స్ లో లవ్ ఫెయిల్యూర్ పాటలు పాడడంలో అరిజిత్ సింగ్ తర్వాతే ఎవరైనా అని అంటుంటారు. అరిజిత్ తల్లి మరణంపై పలువురు ప్రముఖులు, అభిమానులు దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. అరిజిత్ సింగ్ తల్లి ఆత్మకు శాంతి చేకూరాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉన్నారు.


Next Story
Share it