టాలీవుడ్‌లో మ‌రో విషాదం.. ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు క‌న్నుమూత‌

Singer anand passes away.తాజాగా ప్ర‌ముఖ గాయ‌కుడు, సంగీత ద‌ర్శ‌కుడు జి.ఆనంద్ క‌రోనాతో క‌న్నుమూశారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 May 2021 3:02 AM GMT
Singer anand passes away

టాలీవుడ్‌లో మ‌రో విషాదం నెల‌కొంది. క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా ఇప్ప‌టికే ఎంతో మంది సినీ ప్ర‌ముఖులు క‌న్నుమూశారు. ఆ విషాద ఘ‌ట‌న‌ల నుంచి తేరుకోక‌ముందే.. తాజాగా ప్ర‌ముఖ గాయ‌కుడు, సంగీత ద‌ర్శ‌కుడు జి.ఆనంద్ క‌రోనాతో క‌న్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన కరోనాతో బాధపడుతున్నారు. ఇంట్లోనే ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. ఈక్ర‌మంలో ఆయ‌న ప‌రిస్థితి విష‌మించింది. స‌కాలంలో వెంటిలేట‌ర్ లభించకపోవడంతో ఆనంద్ తుది శ్వాస విడిచారని తెలుస్తోంది. ఆయ‌న వ‌య‌స్సు 67 సంవ‌త్స‌రాలు. ఆయ‌న మృతి ప‌ట్ల ప‌లువురు సినీ ప్ర‌ముఖులు సంతాపం తెలిపారు.

ఐదు ద‌శాబ్దాలుగా సినీ రగంలో కొన‌సాగుతూ వ‌స్తున్న ఆనంద్ స్వర మాధురి' బృందం ద్వారా ప్రపంచమంతటా 6500 పైచిలుకు ప్రదర్శనలు ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లా తులగమ్‌ గ్రామానికి చెందిన ఆనంద్ 'ఒక వేణువు వినిపిం చెను' (అమెరికా అమ్మాయి), 'దిక్కులు చూడకు రామయ్య, 'విఠలా విఠలా పాండురంగ విఠలా' వంటి సూపర్‌ హిట్‌ పాటలను పాడారు. 'గాంధీనగర్‌ రెండో వీధి', 'స్వాతంత్య్రానికి ఊపిరి పోయండి', 'రంగవల్లి' చిత్రాలకు సంగీత దర్శకుడిగానూ ప‌ని చేశారు. సీరియ‌ల్స్‌కు,అనువాద చిత్రాల‌కు సంగీత సార‌థ్యం కూడా వ‌హించారు.


Next Story
Share it