డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడిన 'సింగం 2' నటుడు
Singam 2 Fame Nigerian Actor Chekwume Malvin Arrest.సినిమా వేరు నిజ జీవితం వేరు. అయితే కొందరు సినిమాలో పోషించిన
By తోట వంశీ కుమార్ Published on
30 Sep 2021 3:27 AM GMT

సినిమా వేరు నిజ జీవితం వేరు. అయితే కొందరు సినిమాలో పోషించిన పాత్రలనే నిజ జీవితంలోనూ జీవిస్తున్నారు. తాజాగా డ్రగ్స్ కేసులో నటుడు అరెస్ట్ అయ్యాడు. నైజీరియన్ నటుడు చెకుమావే మాల్విన్ ను డ్రగ్స్ కేసులో బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. సూర్య హీరోగా వచ్చిన సింగం 2 చిత్రంలో అక్రమంగా డ్రగ్స్ సప్లై చేసే ముఠాకు సంబంధించిన వాడిగా నటించాడు. కట్ చేస్తే ఆయన నిజంగానే డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ పోలీసులకు చిక్కాడు.
బిజినెస్ మ్యాన్ తో పాటు కాలేజీ విద్యార్థులకు డ్రగ్స్ అమ్ముతుండగా ఈస్ట్ బెంగళూరు పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా మాల్విన్‌ను పట్టుకున్నారు. అతడి నుంచి 15 గ్రాముల ఎమ్‌డిఎమ్ఏ(MDMA)తో పాటు 250 మిల్లీలీటర్ల హ్యాష్ ఆయిల్, మొబైల్ ఫోన్‌లు, రూ. 2,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. సింగం 2 చిత్రంలోనే కాకుండా పలు సౌత్ చిత్రాల్లో నటించాడు. ప్రస్తుతం చిత్ర పరిశ్రమను డ్రగ్స్ వ్యవహారం కుదిపేస్తుండగా.. ఈ నటుడు పట్టుబడడం గమనార్హం.
Next Story