ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌.. రీ రిలీజ్‌కు సిద్ధ‌మైన ఎన్టీఆర్ మూవీ

టాలీవుడ్‌లో సినిమాల రీ రిలీజ్‌ హవా కొనసాగుతోంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్,

By అంజి  Published on  10 April 2023 2:30 PM IST
Simhadri movie, NTR Birthday, Tollywood news

ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌.. రీ రిలీజ్‌కు సిద్ధ‌మైన ఎన్టీఆర్ మూవీ

టాలీవుడ్‌లో సినిమాల రీ రిలీజ్‌ హవా కొనసాగుతోంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి ప్రముఖ తెలుగు సినిమా నటుల అభిమానులు తమ అభిమాన హీరోల పుట్టినరోజులకు వారి హిట్ చిత్రాల ప్రత్యేక ప్రదర్శనలను నిర్వహించి జరుపుకుంటున్నారు. జల్సా, పోకిరి, ఆరెంజ్, దేశముదురు వంటి సినిమాల రీ-రిలీజ్‌లు బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను రాబట్టడంలో విజయవంతమయ్యాయి. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తమ హీరో పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ సింహాద్రి మే 20న మళ్లీ విడుదల కానుంది. ఈ చిత్రం మొదట విడుదలైనప్పుడు భారీ విజయాన్ని సాధించింది. జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజున తిరిగి విడుదల చేయడానికి ఇది సరైన ఎంపికగా ఫ్యాన్స్‌ భావిస్తున్నారు. సింహాద్రిలో భూమిక, అంకిత హీరోయిన్లుగా నటించగా, ముఖేష్ రిషి, నాజర్, రాహుల్ దేవ్, బ్రహ్మానందం, శరత్ సక్సేనా ముఖ్య పాత్రలు పోషించారు. విజయేంద్ర ప్రసాద్ కథ అందించిన ఈ చిత్రాన్ని వి.విజయ్ కుమార్ వర్మ నిర్మించారు. ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించారు.

Next Story