పుష్ప 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1700 కోట్ల గ్రాస్ వసూలు చేసిన బ్లాక్ బస్టర్. ఈ చిత్రం తదుపరి భాగానికి అవకాశం ఉండేలా కొన్ని సీన్స్ సినిమా క్లైమాక్స్ లో చూపించారు. పుష్పరాజ్ పాత్ర ఇతర భాగాలకు భారీ పునాదిని సృష్టించడానికి సరిపోతుంది. చిత్ర బృందం నుండి అధికారిక ప్రకటన ఉన్నప్పటికీ, సినిమా 3వ భాగం వస్తుందా, లేదా అని ప్రేక్షకులలో సందేహం ఉంది.
SIIMA 2025 అవార్డు ఫంక్షన్స్ లో పుష్ప 2 బృందం ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటి, ఉత్తమ సంగీతం వంటి అనేక అవార్డులను కైవసం చేసుకుంది. అవార్డు ప్రదానోత్సవంలో సుకుమార్ పుష్ప-3 రాబోతోందని స్పష్టం చేశారు. ఎటువంటి సందేహం అవసరం లేదని ధృవీకరించారు. పుష్ప 3: ది రాంపేజ్ ఖచ్చితంగా ఉంటుందని తేల్చేశారు. రామ్ చరణ్ తో సినిమా పూర్తి చేసిన తర్వాత సుకుమార్ పుష్ప ఫ్రాంచైజీ మూడవ భాగం విషయంలో పని చేస్తాడని ప్రచారం జరుగుతోంది.