'ఛీటర్స్' అంటూ సిద్ధార్థ్ ట్వీట్.. ఆమెను ఉద్దేశించేనా..?
Siddharth tweet goes viral.తెలుగు, తమిళ పరిశ్రమలో తనకంటూ మంచి పేరు తెచ్చుకున్నాడు సిద్ధార్థ్. చాలా రోజుల
By తోట వంశీ కుమార్
తెలుగు, తమిళ పరిశ్రమలో తనకంటూ మంచి పేరు తెచ్చుకున్నాడు సిద్ధార్థ్. చాలా రోజుల తరువాత తెలుగులో మహాసముద్రం చిత్రంలో నటిస్తున్నారు. సినిమా సంగతులు కాస్త పక్కన బెడితే.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు సిద్దార్థ్. సినీ, రాజయకీయ అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తుంటాడు. అయితే.. తాజాగా సిద్దార్థ్ చేసిన ఓ ట్వీట్ వైరల్‌గా మారింది.
"మోసం చేసేవాళ్లు ఎప్పుడూ బాగుపడరు. చిన్నప్పుడు నేను స్కూల్లో టీచర్ దగ్గర మొదట నేర్చుకుంది అదే.. మరి మీరేం నేర్చుకున్నారు..? " అంటూ ట్వీట్ చేశారు. ఇందులో అతడు ఎవరి పేరును ప్రస్తావించకున్నా కూడా.. ఇది సమంతను ఉద్దేశించి చేసిందేనని నెటీజన్లు అంటున్నారు.
One of the first lessons I learnt from a teacher in school...
— Siddharth (@Actor_Siddharth) October 2, 2021
"Cheaters never prosper."
What's yours?
సమంత, సిద్దార్థ్ ప్రేమ గురించి అందరికి తెలిసిందే. జబర్దస్త్ చిత్ర షూటింగ్ సమయంలోనే ఈ ఇద్దరూ ప్రేమలో పడ్డట్టు, పెళ్లి వరకు వెళ్లినట్టు కథనాలు పుట్టుకొచ్చాయి. ఏమైందో ఏమో సడెన్ ఇద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారు. ఆ సమయంలో వాటిపై సమంత పరోక్షంగా స్పందించింది. తన జీవితం కూడా మహానటి సావిత్రిలా అయ్యేదంటూ, తృటిలో తప్పించుకున్నట్టు ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
అనంతరం అక్కినేని నాగచైతన్యతో ప్రేమలో పడడం పెళ్లి చేసుకోవడం జరిగిపోయింది. నిన్న ఇద్దరూ విడిపోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇలా వీరు విడిపోతున్నట్లు ప్రకటించిన కొద్ది సేపటికే.. సిద్దార్థ్ ట్వీట్ చేయడం గమనార్హం.