ప్రేక్షకులను తిడుతున్న బాలీవుడ్ డైరెక్టర్

హృతిక్ రోషన్- దీపికా పదుకొణె కలిసి నటించిన 'ఫైటర్' సినిమాకు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించారు.

By Medi Samrat  Published on  2 Feb 2024 7:30 PM IST
ప్రేక్షకులను తిడుతున్న బాలీవుడ్ డైరెక్టర్

హృతిక్ రోషన్- దీపికా పదుకొణె కలిసి నటించిన 'ఫైటర్' సినిమాకు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించారు. గత నెల 25వ తేదీన విడుదలైన ఈ సినిమాకు సానుకూల సమీక్షలు వచ్చాయి. ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ కూడా లభించాయి. గణతంత్ర దినోత్సవం రోజున, తదుపరి వారాంతంలో మంచి వసూళ్లను సాధించింది. ఫైటర్ సినిమా కలెక్షన్స్ వీకెండ్ తర్వాత భారీ డ్రాప్ మొదలైంది. ప్రస్తుతం ఈ సినిమాకు రోజూ సింగిల్ డిజిట్ కలెక్షన్లు వస్తూ ఉన్నాయి.

ఈ యాక్షన్ డ్రామాకి దర్శకత్వం వహించిన సిద్ధార్థ్ ఆనంద్ ప్రేక్షకులను తప్పుబడుతూ వ్యాఖ్యలు చేశారు. సినిమాను గ్రహించడంలో ప్రేక్షకులు విఫలమయ్యారు. మన దేశ జనాభాలో దాదాపు 90% మంది విమానాల్లో ప్రయాణించడం లేదా విమానాశ్రయాన్ని చూడడం లేదు. కాబట్టి, సినిమాలో ఏమి జరుగుతుందో వారు ఎలా అర్థం చేసుకుంటారు? అని వ్యాఖ్యలు చేశారు. అందుకే జనానికి సినిమా అర్థం అవ్వలేదని చెబుతున్నారు డైరెక్టర్. ఆయన చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ సినిమాకి జనాలు ఎందుకు కనెక్ట్ కాలేదో డైరెక్టర్ నే అడగాలని విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ప్రేక్షకులను సూటిగా నిందించడం ఏ మాత్రం కరెక్ట్ కాదు. ప్రతి దర్శకుడు ప్రేక్షకుల కోసం సినిమా తీస్తాడు.. ప్రేక్షకులు సినిమాకు, దానిలోని అంశాలకు బాగా కనెక్ట్ అయ్యేలా చూడడం దర్శకుడి పని అనే విషయం తెలుసుకోవాలి.

Next Story