ఉర్రూత‌లూగిస్తున్న 'రైజ్ ఆఫ్ శ్యామ్' లిరికల్‌ సాంగ్‌

Shyam Singha Roy movie first lyrical song released.నేచుర‌ల్ స్టార్ నాని న‌టిస్తున్న తాజా చిత్రం శ్యామ్ సింగరాయ్. 1970

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 Nov 2021 3:10 PM IST
ఉర్రూత‌లూగిస్తున్న రైజ్ ఆఫ్ శ్యామ్ లిరికల్‌ సాంగ్‌

నేచుర‌ల్ స్టార్ నాని న‌టిస్తున్న తాజా చిత్రం 'శ్యామ్ సింగరాయ్'. 1970 కాలం నాటి కలకత్తా బ్యాక్ డ్రాప్‌లో హై వోల్టేజ్ పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి ట్యాక్సీవాలా ఫేమ్ రాహుల్ సాంకృత్య‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. తెలుగు, క‌న్న‌డ‌, త‌మిళ, మ‌ల‌యాళ బాష‌ల్లో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో సాయి పల్లవి, కృతీ శెట్టి, మడోన్నా సెబాస్టియన్ క‌థానాయిక‌లు న‌టిస్తున్నారు. డిసెంబ‌ర్ 24న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలోనే చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది.

తాజాగా 'రైజ్‌ ఆఫ్‌ శ్యామ్‌'ఫుల్‌ లిరికల్‌ సాంగ్‌ని చిత్ర బృందం విడుద‌ల చేసింది. 'శ్యామ్ సింగ రాయ్.. ఎగసిపడే అలజడివాడే.. తిరగబడే సంగ్రామం వాడే.. వెనకబడని చైతన్యం వాడే'' అంటూ ఈ పాట సాగుతోంది. బాలీవుడ్ సింగ‌ర్ విశాల్ ద‌ద్లానీ పాడిన ఈ పాట ఉర్రూత‌లూగిస్తోంది. ఈ పాటకు కృష్ణకాంత్ సాహిత్యాన్ని అందించ‌గా.. మిక్కీజే మేయ‌ర్ సంగీతాన్ని అందించారు. ఇక ఈ చిత్రంలో నాని రెండు విభిన్న పాత్ర‌ల్లో న‌టిస్తున్న‌ట్లు తెలుస్తోంది. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నాని కెరీయ‌ర్‌లోనే భారీ బ‌డ్జెట్‌తో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది.

Next Story