ఆక‌ట్టుకుంటున్న శ్యాయ్ సింగ‌రాయ్ ఫ‌స్ట్‌లుక్‌

Shyam Singha Roy first look released.'శ్యామ్ సింగ‌రాయ్' చిత్ర బృందం స‌ర్‌ప్రైజ్ ఇచ్చింది. ఈ చిత్రంలో నాని లుక్‌ను విడుద‌ల చేశారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 Feb 2021 4:28 PM IST
Shyam Singha Roy first look released

టాలీవుడ్ యంగ్ హీరో నాని జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఈ రోజు నాచుర‌ల్ స్టార్ పుట్టిన రోజు సంద‌ర్భంగా అభిమానుల‌కు 'శ్యామ్ సింగ‌రాయ్' చిత్ర బృందం స‌ర్‌ప్రైజ్ ఇచ్చింది. ఈ చిత్రంలో నాని లుక్‌ను విడుద‌ల చేశారు. ఈ పోస్టర్‌ను నాని తన ట్వీటర్ ద్వారా విడుదల చేశారు. పేరు శ్యామ్. పూర్తి పేరు శ్యామ్ సింగరాయ్. ఈ ఫస్ట్‌లుక్‌లో నాని జేబుల్లో చేతులు పెట్టుకొని నించొని ఉంటే వెనుక నుంచి హీరోయిన్ కౌగిలించుకొని ఉన్నారు.


ప్ర‌స్తుతం ఈ లుక్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. కలకత్తా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో నాని సరసన సాయి పల్లవి, కృతి శెట్టి నటిస్తున్నారు. రాహుల్ సాంకృత్యన్ దర్వకత్వంలో తెర‌కెక్క‌తున్న ఈచిత్రాన్ని నాగవంశీ నిర్మిస్తున్నారు. ఫ‌స్ట్‌లుక్ ఈ సినిమాపై అంచ‌నాల‌ను మ‌రింత‌గా పెంచేసింది. నాని త్వరలో 'టక్ జగదీష్' గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ‌'నిన్నుకోరి' లాంటి మంచి హిట్ అందించిన శివ నిర్వాణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. ఈ చిత్రం ఏప్రిల్ 23న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.


Next Story