ఇటు మార‌థాన్‌.. అటు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో 'శ్యామ్‌ సింగ రాయ్' టీమ్‌

Shyam Singaroy movie team participated in Green India Challenge. నేచుర‌ల్ స్టార్ నాని న‌టించిన చిత్రం శ్యామ్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 Dec 2021 12:51 PM IST
ఇటు మార‌థాన్‌.. అటు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో శ్యామ్‌ సింగ రాయ్  టీమ్‌

నేచుర‌ల్ స్టార్ నాని న‌టించిన చిత్రం 'శ్యామ్ సింగ‌రాయ్‌'. రాహుల్ సాంకృత్యాన్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో సాయిపల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్ లు క‌థానాయిక‌లుగా న‌టించారు. క్రిస్మ‌స్ కానుక‌గా డిసెంబ‌ర్ 24న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. ఈ నేప‌థ్యంలో చిత్ర‌బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచ‌డంతో పాటు వినూత్నంగా ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. అందులో భాగంగా నేడు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్క‌లు నాటే కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టారు. హీరో నాని, హీరోయిన్లు సాయి పల్లవి, కృతిశెట్టి, నిర్మాత బోయినపల్లి వెంకట్ మొక్కలు.. జూబ్లీహిల్స్‌లోని ప్రసాసన్ నగర్‌లో ఉన్న జీహెచ్‌ఎంసీ పార్కులో మొక్క‌లు నాటారు. ఈ సంద‌ర్భంగా నాని మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా చాలెంజ్ మనందరి బాధ్యత అని.. ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.


మారథాన్‌లో..

హైదరాబాద్‌ మారథాన్‌ పదో ఎడిషన్‌లో సైతం శ్యామ్ సింగ‌రాయ్ చిత్ర‌బృందం పాల్గొంది. హీరో నాని, హీరోయిన్లు సాయిపల్లవి, కృతి శెట్టి మారథాన్‌లో పాల్గొని రన్నర్లను ప్రోత్సహించారు. మారథాన్‌లో వీళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆదివారం ఉద‌యం సీపీ అంజ‌నీకుమార్ ఈ మార‌థాన్ ప్రారంభించారు. పీపుల్స్‌ ప్లాజా నుంచి గచ్చిబౌలి స్టేడియం వరకు 42 కిలోమీటర్లు (ఫుల్‌ మారథాన్)‌, 21 కిలోమీటర్లు (హాఫ్‌ మారథాన్‌), 10కే మారథాన్‌ నిర్వహిస్తున్నారు. మారథన్ నేపథ్యంలో పీపుల్స్‌ ప్లాజా నుంచి గచ్చిబౌలి వెళ్లే మార్గంలో ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉన్నాయి.


Next Story