ప్రభాస్‌తో శృతిహాసన్ రొమాన్స్..!
Shruti Hassan in Prabhas Salaar Movie. 'సలార్' కు ప్రభాస్‌తో శృతిహాసన్ నటించనుందని తెలుస్తోంది
By తోట వంశీ కుమార్ Published on 25 Jan 2021 10:54 AM ISTయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ క్షణం తీరికలేకుండా వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇటీవలే 'రాధేశ్యామ్' చిత్ర షూటింగ్‌ను పూర్తి చేసిన ప్రభాస్.. మరో రెండు పాన్ ఇండియా మూవీల్లో నటించాల్సి ఉంది. అందులో ఒకటి 'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం 'సలార్'. ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. 'కేజీఎఫ్' ఎంతటి సంచనాలు సృష్టించిందో అందరికి తెలిసిందే.
ఈ చిత్రం గతవారం హైదరాబాద్‌లో అధికారిక పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది. ఇక ఈ చిత్ర ప్రకటన వెలువడినప్పటి నుండి ప్రభాస్ సరసన బాలీవుడ్ నటి దిషా పటానీ కథానాయికగా నటించనుందని వార్తలు వినిపించాయి. అయితే.. చిత్ర బృందం మాత్రం ఎటువంటి ప్రకటన చేయలేదు. తాజాగా దిషా పటానీ ప్లేస్‌లో శృతిహాసన్ నటించనుందని తెలుస్తోంది. శృతి అన్ని భాషల్లో గుర్తింపు పొందిన నాయిక కావడం, రెమ్యూనరేషన్ లో కూడా పెద్దగా ఇబ్బందులు లేకపోవడం 'సలార్' కు కలిసొచ్చే అంశంగా పరిశీలిస్తున్నారట. అంతేకాకుండా ప్రభాస్-శృతి జంటగా నటించలేదు కాబట్టి ఈ కాంబినేషన్ అయితే బాగుంటుందని అనుకుని ఇటీవలే శృతిని సంప్రదించారని టాక్. శృతి కూడా వెంటనే ఓకే చెప్పేసిందని తెలుస్తోంది.
శృతి హాసన్, హీరోయిన్‌గా మాత్రమే కాకుండా సింగర్ గా, డ్యాన్సర్ గా, సంగీత దర్శకురాలుగా, నిర్మాత గాను.. ఇలా సినిమా అన్ని విభాగాల్లోను రాణిస్తోంది. కొద్దికాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన శృతి.. ఇటీవల వరుసగా చిత్రాల్లో నటిస్తుంది. ఇటీవలే క్రాక్ చిత్రంతో హిట్ కొట్టింది.