ఇది ఫన్ కాదు.. నాకు కరోనా సోకింది : శృతిహాసన్
Shruti Haasan tests positive for Covid-19.లోకనాయకుడు కమల్‌హాసన్ కుమారైగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టినప్పటికీ
By తోట వంశీ కుమార్ Published on
27 Feb 2022 7:34 AM GMT

లోకనాయకుడు కమల్‌హాసన్ కుమారైగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టినప్పటికీ.. గాయనిగా, నటిగా తన కంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది శృతిహాసన్. తాజాగా ఆమె కరోనా బారిన పడింది. ఈ విషయాన్ని శృతిహాసన్ ఆదివారం సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. అన్నీ జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ తనకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయినట్లు చెప్పింది. ఈ విషయం తెలిసిన ఆమె అభిమానులు, పలువురు సినీ సెలబ్రెటీలు ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.
'అందరికీ నమస్కారం! ఇది అంత సరదాగా ఉండే అప్‌డేట్ కాదు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, నాకు కొవిడ్ పాజిటివ్ అని తేలింది. నేను కోలుకుంటున్నాను. త్వరలో ఆరోగ్యంతో తిరిగి వస్తాను ! ధన్యవాదాలు, త్వరలో కలుద్దాం లవ్లీస్' ట్వీట్ చేసింది శృతి హాసన్.
ఇక సినిమాల విషయానికి వస్తే.. యంగ్ రెబల్ ప్రభాస్ సరసన 'సలార్' చిత్రంలో శృతి నటిస్తోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. నందమూరి బాలకృష్ణ NBK 107లో కూడా శృతి నటిస్తోంది.
Next Story