వీడియో.. శ్రియా శ‌ర‌ణ్‌కు పెద్ద ప్ర‌మాదం త‌ప్పింది..!

Shriya Saran shared a video. శ్రియా త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోని పోస్ట్ చేసింది. ఈ వీడియో చూస్తే.. కొంచెంలో శ్రియాకు పెద్ద ప్ర‌మాద‌మే త‌ప్పిన‌ట్లు అనిపిస్తోంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 March 2021 11:42 AM IST
Shriya Saran

టాలీవుడ్‌లో ఒక‌ప్పుడు టాప్ హీరోయిన్ల‌లో ఒక‌రిగా కొనసాగింది శ్రియా శ‌ర‌ణ్‌. దాదాపు సౌతిండియాలోని స్టార్ హీరోలంద‌రితోనూ ఆడి పాడింది. అయితే.. పెళ్లి త‌రువాత అమ్మ‌డికి పెద్ద‌గా అవ‌కాశాలు రావ‌డం లేదు. అయిన‌ప్ప‌టికీ నిత్యం సోష‌ల్ మీడియా వేదిక‌గా అభిమానుల‌తో ట‌చ్‌లో ఉంటుంది అమ్మ‌డు. భ‌ర్త ఆండ్రూ కోశ్చీవ్‌తో క‌లిసి ప్ర‌స్తుతం పెరూ దేశంలో ప‌ర్య‌టిస్తోంది. అయితే.. తాజాగా శ్రియా త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోని పోస్ట్ చేసింది. ఈ వీడియో చూస్తే.. కొంచెంలో శ్రియాకు పెద్ద ప్ర‌మాద‌మే త‌ప్పిన‌ట్లు అనిపిస్తోంది.



ఆవీడియోలో ఏం ఉందంటే.. మచు పిచు పరిసరాల్లోని పచ్చిక బయళ్లలో ఉన్న మూగ జీవిని శ్రీయ చూస్తోంది. భ‌ర్త కోశ్చీవ్ ఆ జంతువు మీదుగా శ్రీయను కవర్ చేస్తూ ఈ వీడియోను షూట్ చేస్తుంటే అది బెదిరిపోయి మీదినుంచి ఉరకబోతే ఒడుపుగా తప్పుకుంది శ్రీయ. అయితే ఆ క్షణం ఈ అమ్మడికి చెమటలు పట్టేశాయని ఆ అరుపులే చెబుతున్నాయి. పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకుంది. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. దీనిపై నెటీజ‌న్లు ర‌క‌ర‌కాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. `గౌతమి పుత్ర శాతకర్ణి` చిత్రం త‌రువాత పెద్ద సినిమాల్లో దాదాపుగా శ్రియా క‌నిపించ‌లేదు. ఆర్ఆర్ఆర్ లో అతిథి పాత్రలో చేస్తోంది.


Next Story