శ్రద్ధా కపూర్ వేసుకున్న డ్రెస్ ఖరీదు ఎన్ని లక్షలో తెలుసా?

బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ నటించిన 'స్త్రీ 2' సినిమా కోసం బాలీవుడ్ సినీ అభిమానులు ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తూ ఉన్నారు.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  11 Aug 2024 3:00 PM GMT
stree 2, Shraddha Kapoor, Shraddha Kapoor dress, Floral Silk Dress

శ్రద్ధా కపూర్ వేసుకున్న డ్రెస్ ఖరీదు ఎన్ని లక్షలో తెలుసా? 

బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ నటించిన 'స్త్రీ 2' సినిమా కోసం బాలీవుడ్ సినీ అభిమానులు ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తూ ఉన్నారు. ఆగస్టు 15న విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో శ్రద్ధ బిజీ బిజీగా గడుపుతూ ఉంది. ముఖ్యంగా శ్రద్ధా కపూర్ ఎరుపు రంగు చీరలు, డ్రెస్ లతో సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటోంది. ఎందుకంటే ఈ సినిమా థీమ్ కు ఎరుపు రంగుకు లింక్ ఉంది కాబట్టి!!

తాజాగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఎరుపు రంగు దుస్తులు ధరించి మరో పోస్టు పెట్టింది. ఇందులో శ్రద్ధ ఎరుపు రంగు ఫ్లోరల్ సిల్క్ డ్రెస్ ను ధరించి కనిపించింది. అయితే ఈ డ్రెస్ విలువ ఎంతో తెలుసా? అక్షరాలా 2 లక్షల రూపాయలు. అనిత డోంగ్రే ఈ డ్రెస్ ను డిజైన్ చేశారు. అందుకే ఈ డ్రెస్ కు ఇంత భారీ ధర ఉంది. నీ-లెంత్ డ్రెస్ మీద ఫ్లోరల్ మోటిఫ్స్ ఉన్నాయి. వీ నెక్ డ్రెస్ మీద చేతులతో చేసిన వర్క్ ఉంది. అయితే అమ్మడి డ్రెస్ ఖరీదు చూసి నోరెళ్ల బెడుతూ ఉన్నారు. కావాలంటే లింక్ మీకు కూడా ఇస్తాం.. కొనాలనుకుంటే కొనేసుకోండి!

Next Story