శ్రీవారి దర్శనంపై వివాదం..క్లారిటీ ఇచ్చిన శివాని నాగారం

తిరుమల శ్రీవారి దర్శనంపై తాను చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో నటి శివాని నాగారం స్పందించారు.

By -  Knakam Karthik
Published on : 25 Feb 2026 7:30 PM IST

Cinema News, Tollywood News, Shivani Nagaram, Tirumala Darshan Controversy

శ్రీవారి దర్శనంపై వివాదం..క్లారిటీ ఇచ్చిన శివాని నాగారం

తిరుమల శ్రీవారి దర్శనంపై తాను చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో నటి శివాని నాగారం స్పందించారు. శివాని, ఒక ఇంటర్వ్యూలో తనకు 15 నిమిషాల పాటు స్వామివారి దర్శనం కలిగిందని చెప్పడం సోషల్ మీడియాలో పెద్ద దుమారానికి దారితీసింది. సామాన్య భక్తులను సెకన్లలో పంపేసే సిబ్బంది, సెలబ్రిటీలకు అంత సమయం ఎలా ఇస్తారంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ వివాదంపై క్లారిటీ ఇస్తూ శివాని ఒక వీడియో విడుదల చేశారు. తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని, 15 నిమిషాల దర్శనం అంటే గర్భాలయం ముందు అంతసేపు నిలబడటం కాదని ఆమె వివరించారు. క్యూ లైన్‌లో ఉన్నప్పటి నుండి స్వామివారు కనిపిస్తూ ఉంటారని, ఆ ప్రారంభం నుండి దర్శనం ముగించుకుని బయటకు వచ్చే వరకు పట్టిన మొత్తం సమయాన్ని ఉద్దేశించి అలా అన్నానని స్పష్టం చేశారు. అక్టోబర్ 2025లో తానే స్వయంగా రూ. 10,500 శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు కొనుగోలు చేసి, సామాన్య భక్తురాలిగానే దర్శనం చేసుకున్నానని, తనకు ఎలాంటి ప్రత్యేక ప్రోటోకాల్ దక్కలేదని ఆమె వివరణ ఇచ్చారు. తన మాటలు ఎవరినైనా బాధించి ఉంటే క్షమించాలని ఆమె కోరారు.

Next Story