బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, ఆమె తల్లిపై కేసు నమోదు
Shilpa Shetty and her mother Sunanda booked for fraud in Lucknow.బాలీవుడ్ నటి శిల్పా శెట్టి, ఆమె తల్లి సునంద పై
By తోట వంశీ కుమార్ Published on 10 Aug 2021 2:19 PM ISTబాలీవుడ్ నటి శిల్పా శెట్టి, ఆమె తల్లి సునంద పై పోలీసు కేసు నమోదైంది. ఇద్దరి వద్ద నగదు తీసుకుని మోసం చేశారనే అభియోగం మీద ఉత్తరప్రదేశ్ పోలీసులు శిల్పాశెట్టి, ఆమె తల్లి సునంద శెట్టిపై కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. అయోసిస్ వెల్‌నెస్ అనే పేరుతో ఫిట్‌నెస్ సెంటర్‌ను శిల్పాశెట్టి నడిపిస్తున్నారు. దీనికి ఆమె చైర్మన్‌గా ఆమె తల్లి డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో ఈ ఫిట్‌నెస్ సెంటర్ మరో బ్రాంచ్‌ను లక్నోలో ప్రారంభించేందుకు జ్యోత్స్న చౌహాన్, రోహిత్ వీర్ సింగ్ అనే ఇద్దరికి వారు ఫ్రాంచెజ్ ఇచ్చి, సెంటర్‌ను ప్రారంభించేందుకు వారి నుంచి కోట్ల రూపాయలు తీసుకున్నారు.
ఆ తర్వాత దీనిపై వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో శిల్పా, ఆమె తల్లి సునందలు తమ వద్ద డబ్బులు తీసుకుని మోసం చేశారంటూ పోలీసులను ఆశ్రయించారు జ్యోత్స్న చౌహాన్, రోహిత్ వీర్ సింగ్. ఈ మేరకు వీరిద్దరిపై లఖ్‌నవూలోని హజరత్ గంజ్, విభూతి ఖండ్ పోలీస్ స్టేషన్లలో రెండు ఫిర్యాదు వచ్చాయని.. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వీరిని విచారించడానికి ముందుగా వారికి నోటీసులు పంపినట్లు తెలిపారు. ఇప్పటికే శిల్పాను, ఆమె తల్లిని విచారించేందుకు డీసీపీ, ఒక బృందం ముంబై చేరుకుంది.
కాగా.. కొద్ది రోజుల క్రితం పోర్నోగ్రఫి కేసులో శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రాను ముంబయి పోలీసులు అరెస్టు చేసిన విషయం సంగతి తెలిసిందే. ఆ కేసులో పోలీసులు శిల్పాశెట్టిని ఇది వరకే ప్రశ్నించారు. ఆ కేసు దర్యాప్తు కొనసాగుతోంది.