ఆద్యంతం ఉత్కంఠగా శేఖ‌ర్ ట్రైల‌ర్‌

Shekar Trailer out.యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజ‌శేఖ‌ర్ న‌టిస్తున్న చిత్రం శేఖ‌ర్‌. మలయాళంలో సూపర్ హిట్ అయిన

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 May 2022 7:07 AM GMT
ఆద్యంతం ఉత్కంఠగా శేఖ‌ర్ ట్రైల‌ర్‌

యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజ‌శేఖ‌ర్ న‌టిస్తున్న చిత్రం 'శేఖ‌ర్‌'. మలయాళంలో సూపర్ హిట్ అయిన 'జోసెఫ్' చిత్రానికి రీమేక్ గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి జీవిత రాజ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. రాజశేఖ‌ర్ కుమారై శివాని ఓ కీల‌క పాత్ర‌లో న‌టించిన ఈ చిత్రం మే 20న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. ఈ నేప‌థ్యంలోనే చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది. అందులో భాగంగా నేడు ఈ చిత్ర ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసింది.

'పోలీస్ యూనిఫామ్ వేసుకుని కూడా డ్యూటీ చేయ‌ని వాళ్లు చాలా మంది ఉంటారు. అదే.. పోలీస్ ఉద్యోగానికి రిజైన్ చేసి కూడా డ్యూటీ కోసం ప్రాణాలిచ్చే వాళ్లు వేలల్లో ఒక్క‌రే ఉంటారు' అనే డైలాగ్‌తో ట్రైల‌ర్ ప్రారంభ‌మైంది. ఈ ట్రైలర్‌ ఆద్యంతం ఉత్కంఠగా సాగుతూ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఓ మర్డర్​ కేసును ఛేదించే రిటైర్డ్​ ఆఫీసర్​గా రాజశేఖర్​ కనిపించారు. వయసు పైబడిన వ్యక్తిగా రాజశేఖర్​ కొత్త లుక్స్​ బాగున్నాయి.

రాజ‌శేఖ‌ర్ కెరీర్‌లో 91వ చిత్రంగా వ‌స్తున్న ఈ సినిమాని బొగ్గరం వెంకట శ్రీనివాస్‌, శివాని రాజశేఖర్‌, శివాత్మిక రాజశేఖర్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అనూప్‌ రూబెన్స్‌ సంగీతాన్ని అందించారు.

Next Story
Share it