మ‌హాస‌ముద్రం.. శ‌ర్వానంద్‌ ఫ‌స్ట్‌లుక్ వ‌చ్చేసింది

Sharwanand first look from Mahasamudram.శర్వానంద్ పుట్టిన రోజు సందర్భంగా తాజాగా `మహాసముద్రం` ఫస్ట్‌లుక్ విడుదలైంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 March 2021 5:31 AM GMT
Sharwanand first look from Mahasamudram.

వైవిధ్య‌భ‌రిత సినిమాల‌ను చేస్తూ ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్న న‌టుడు శ‌ర్వానంద్. ప్ర‌స్తుతం ఈ యువ హీరో వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. వాటిలో ఓ మల్టీస్టారర్ ఉన్న విషయం తెలిసిందే. శ‌ర్వానంద్, సిద్ధార్థ కలిసి న‌టిస్తున్న చిత్రం 'మహాసముద్రం'. శర్వానంద్ పుట్టిన రోజు సందర్భంగా తాజాగా `మహాసముద్రం` ఫస్ట్‌లుక్ విడుదలైంది. ఈ పోస్టర్‌లో శర్వానంద్ మాస్, రఫ్ లుక్‌లో ఉన్నాడు. పూర్తి యాక్షన్ మోడ్‌లో భీకరంగా ఉన్నాడు. అంతేకాకుండా చూట్టూతా పడవలు ఉన్నాయి కాబట్టి ఎదో సముద్రతీరంలో ఫైట్ సీన్‌లా ఉంది. 'ఆర్ఎక్స్ 100' చిత్రంతో ఆక‌ట్టుకున్న ద‌ర్శ‌కుడు అజ‌య్ భూప‌తి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. అను ఇమ్మాన్యుయల్, అదితి రావ్ హైదరీ కథానాయిక‌లుగా న‌టిస్తున్నారు.

జగపతి బాబు కీలక పాత్రలో కనిపించనున్న ఈ చిత్రంతోనే సిద్దార్థ మ‌ళ్లీ తెలుగులో రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర ఈ సినిమాని నిర్మిస్తున్నారు. విడుదలైన అతి తక్కువ సమయంలోనే పోస్టర్ వైరల్ అయింది. ఈ చిత్రం ఆగస్ట్ 19న విడుదల కాబోతోంది. ఇక, శర్వానంద్ నటించిన `శ్రీకారం' ట్రైలర్ తాజాగా విడుదలై అందరినీ ఆకట్టుకుంది. శ్రీకారం చిత్రం మార్చి 11న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.


Next Story
Share it