దీప్తి సునయనతో బ్రేకప్ పై షణ్ముఖ్ సంచలన వ్యాఖ్యలు
Shanmukh Jashwanth reacts on Deepthi Sunaina Breakup.సోషల్ మీడియా స్టార్స్, బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ దీప్తి సునయన
By తోట వంశీ కుమార్ Published on 15 Feb 2022 11:08 AM ISTసోషల్ మీడియా స్టార్స్, బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ దీప్తి సునయన, షణ్ముఖ్ జస్వంత్ బ్రేకప్‌పై తొలిసారి షణ్ముఖ్ స్పందించాడు. బ్రేకప్‌కు సిరి కారణం కాదని చెప్పాడు. సిరి ఎప్పటికీ ఓ మంచి స్నేహితురాలు మాత్రమేనని అన్నాడు. ప్రస్తుతం కెరీర్ పైనే పూర్తి దృష్టి పెట్టినట్లు వెల్లడించాడు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన షణ్ముఖ్ కొన్ని ఆసక్తికర అంశాలను బయటపెట్టాడు.
నేను ఇతరులతో చాలా తక్కువగా మాట్లాడుతాను. నా పాయింట్ ఆఫ్ వ్యూలో బిగ్‌బాస్ వంటి రియాల్టీ షోకి నేను సెట్ కాను. ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకోవడం కోసమే రియాల్టీ షోలో పాల్గొన్నాను. ఆ షోలో ఉన్నప్పుడు ప్రేక్షకులు నా గురించి పాజిటివ్‌గానే ఆలోచిస్తున్నారు అని అనుకునేవాడిని. అయితే.. బయటకు వచ్చాకనే అసలు విషయం తెలిసింది. నా పై ఎంతటి నెగిటివిటీ వచ్చిందో అర్థమైంది. నా వయస్సు 27 సంవత్సరాలు. కెరీర్, పర్సనల్ లైఫ్‌లో వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. వీటికి ఏం బాధపడను. ఎదరుదెబ్బల వల్ల జీవితంలో ఎలా ముందుకు సాగాలి అనేది నేర్చుకుంటున్నాను.
హౌస్ లో ఉన్నప్పుడు సిరికి అండగా నిలబడ్డాను. సిరితో చనువుగా ఉండటమే నెటిజన్లలో నాపై వ్యతిరేకత పెరగడానికి కారణం అని అనుకుంటున్నా. అప్పటికే నేను దీప్తీతో, సిరి శ్రీహాన్‌తో రిలేషనల్‌లో ఉన్నాం. హౌస్‌లో ఉన్నప్పుడు మేమిద్దరం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం.. దీంతో మా ఇద్దరి మధ్య కాస్త చనువు పెరిగింది. దీని వల్లే మాపై వ్యతిరేకత పెరిగింది. సిరి వాళ్లమ్మ వచ్చి మీరిద్దరు హగ్ చేసుకోవడం నచ్చలేదని అందరి ముందూ చెప్పింది. ఆమె అలా మాట్లాడటం నాకు నచ్చలేదు. ఆమె మాటలు నన్ను ఎంతో బాధించాయి.
ఇక దీప్తి, నేను విడిపోవడానికి చాలా కారణాలున్నాయి. నా వల్ల దీప్తి ఎంతో నెగిటివిటీని ఎదుర్కొంది. నెటిజన్స్ నన్ను ట్రోల్ చేస్తున్నప్పుడు కూడా తను నాకు సపోర్ట్ చేసింది. సిరితో నేను చనువుగా ఉండటం బయటవాళ్లకు ఎలా నచ్చలేదో అదే విధంగా దీప్తి కుటుంబాని నచ్చలేదు. దాని వల్ల నా విషయంలో అందరి నుంచి తనకి ఒత్తిడి వచ్చింది. ఇకనైనా తను సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతోనే బ్రేకప్ చెప్పుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం మేము ఇద్దరం మా కెరీర్‌లపైనే దృష్టి పెట్టాం. ఇక మేమిద్దరం మళ్లీ కలుస్తామా..? లేదా..? అనేది దేవుడి చేతుల్లోనే ఉంది. విధి మా జీవితాల్లో ఏదీ రాస్తే అదే జరుగుతుందని నేను నమ్ముతున్నా. మా బ్రేకప్ గురించి సిరిని నిందించడం సరికాదు అని షణ్ముఖ్ చెప్పాడు.