టీవీ ప్రోగ్రాంలో ట్రాన్స్‌జెండ‌ర్ కూతుర్ని ప‌రిచ‌యం చేసిన ష‌కీలా..

Shakeela opens up about her transgender daughter.ష‌కీలా.. ఈ పేరు తెలియ‌ని వారంటూ దాదాపుగా ఉండ‌రు. ఒక‌ప్పుడు శృంగార

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 March 2021 6:37 AM GMT
టీవీ ప్రోగ్రాంలో ట్రాన్స్‌జెండ‌ర్ కూతుర్ని ప‌రిచ‌యం చేసిన ష‌కీలా..

ష‌కీలా.. ఈ పేరు తెలియ‌ని వారంటూ దాదాపుగా ఉండ‌రు. ఒక‌ప్పుడు శృంగార తార‌గా ఓ వెలుగు వెలిగింది. ఆమె న‌టించిన చిత్రాలు విడుద‌ల అవుతున్నాయంటే.. స్టార్ హీరోలు సైతం త‌మ చిత్రాల‌ను వాయిదా వేసుకోవాల్సిన ప‌రిస్థితి ఉండేది. స్టార్ హీరోల‌కు ద‌క్క‌ని పాపులారిటీ ఆమె సొంతం. అయితే.. ఆ త‌రువాత ఉన్న‌ట్లుండి కెరీర్‌లో ఆమె ఢీలా ప‌డింది. కార‌ణం ఏదైన‌ప్ప‌టికి అనంత‌రం ఆమె చిన్న చిన్న పాత్ర‌ల‌కే మాత్ర‌మే ప‌రిమితం అయ్యింది. సినీ కెరీర్‌లోనే కాదు నిజ‌జీవితంలో ఆమె ఎన్నో ఒడిదుకుల‌ను ఎదుర్కొంది. త‌న‌ను అర్థం చేసుకునే వ్య‌క్తి దొర‌క‌క పోవ‌డంతో పెళ్లి చేసుకోకుండా ఒంట‌రిగానే మిగిలిపోయింది.


ఒంట‌రిగా ఉండ‌డం ఇష్టం లేక ఆమె ఓ ట్రాన్స్‌జెండ‌ర్‌ను ద‌త్త‌త తీసుకునిపెంచుకుంది. తాజాగా.. త‌మిళ ప్రోగ్రాం 'కుకు విత్ కోమ‌లి'లో పాల్గొన్న ష‌కీలా తన కుమార్తెని తొలిసారి పరిచయం చేసింది. ఆమె పేరు మిల్లా అని, ఆమె త‌న‌ కుమార్తె అని ఆమె చెప్ప‌గానే ప్రేక్ష‌కులు షాక్ అయ్యారు. అయితే, మిల్లా తన సొంత కూతురు కాదని, చాలా ఏళ్ల క్రితం ఆమెను దత్తత తీసుకున్నానని చెప్పింది. ఆమెను ప‌రిచ‌యం చేస్తూ షకీలా భావోద్వేగానికి గురయింది. ఆమెను త‌న‌ సొంత కూతురిలా పెంచుకున్నానని చెప్పింది. తాను క‌ష్టాల్లో ఉన్న‌ప్పుడు మిల్లా త‌న‌కు తోడుగా నిలిచింద‌ని తెలిపింది. తాను కూడా ఆమెకు చాలా మ‌ద్ద‌తు ఇచ్చాన‌ని చెప్పింది. తానంటే ఆమెకు ఎంతో ప్రేమ అని తెలిపింది. మిల్లా కాస్ట్యూమ్ డిజైన‌ర్‌గా ప‌నిచేస్తోంది.




Next Story