అక్కడ ఆర్ఆర్ఆర్ ను దాటేసిన పఠాన్

Shah Rukh Khan’s Pathaan beats RRR in the US. బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ పఠాన్ భారీ అంచనాల నడుమ

By Medi Samrat  Published on  7 Feb 2023 3:45 PM GMT
అక్కడ ఆర్ఆర్ఆర్ ను దాటేసిన పఠాన్

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ పఠాన్ భారీ అంచనాల నడుమ ఈ సినిమా జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా 7700 స్రీన్స్‌లో విడుదలై మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ సినిమా హిందీతో పాటు తెలుగు, తమిళ భాషాల్లో ఒకేసారి విడుదలైంది. ఈ సినిమా కలెక్షన్స్ పరంగా సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.

RRR కలెక్షన్లను తాజాగా పఠాన్ అధిగమించింది. యూఎస్ బాక్సాఫీస్ వద్ద $14.5 మిలియన్‌కు పైగా వసూలు చేసింది. అమెరికాలో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో భారతీయ చిత్రంగా నిలిచింది. ఆర్ఆర్ఆర్ మూవీ యూఎస్‌లో ఓవరాల్‌గా $14.3 మిలియన్లు వసూలు చేసింది. ఇప్పటి వరకు యూఎస్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్ల రికార్డు ‘బాహుబలి 2’ పేరు మీదుంది. బాహుబలి-2 టోటల్ రన్‌లో $20.5 మిలియన్లు వసూళ్లు సాధించింది. పఠాన్ సినిమా ఆ రికార్డును అందుకుంటుందో లేదో చూడాలి.

2018లో షారుఖ్ ఖాన్ ‘జీరో’ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా మిగిలింది. నాలుగేళ్ల తర్వాత షారుఖ్ ‘పఠాన్’ (Pathaan) చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో దీపికా పదుకొనె హీరోయిన్‌గా నటించింది. జాన్ అబ్రహాం విలన్ గా కనిపించాడు.


Next Story
Share it