Pathaan OTT release : అఫీషియల్ : ఓటీటీలో షారుఖ్ ఖాన్ 'ప‌ఠాన్'.., స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ న‌టించిన ప‌ఠాన్ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 March 2023 12:06 PM IST
Shah Rukh, Pathaan OTT release

ఓటీటీలో షారుఖ్ ఖాన్ ప‌ఠాన్ మూవీ

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్‌, దీపికా ప‌దుకొనే జంట‌గా సిద్దార్థ్ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన చిత్రం 'ప‌ఠాన్‌'. జాన్ అబ్ర‌హం విల‌న్‌గా న‌టించిన ఈ చిత్రం 25 జ‌న‌వ‌రి 2023న ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. బాక్సాఫీసు వ‌ద్ద వ‌సూళ్ల సునామీ సృష్టించింది. రూ.1000కోట్ల‌కు పైగా క‌లెక్ష‌న్లు రాబ‌ట్టింది. హిందీ బాష‌లో అత్య‌ధిక వ‌సూళ్లు సాధించిన చిత్రంగా రికార్డులు క్రియేట్ చేసింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ చిత్రం రూ.1048.30కోట్లు వ‌సూలు చేసింది. ఇండియ‌న్ బాక్సాఫీస్ వ‌ద్ద రూ.650కోట్లు, ఓవ‌ర్‌సీస్ రూ.392.10కోట్లు రాబ‌ట్టింది.

ఇక ఈ చిత్రం ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వ‌స్తుందా అని షారుక్ అభిమానుల‌తో పాటు ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్ర స్ట్రీమింగ్ హ‌క్కుల‌ను సొంతం చేసుకున్న అమెజాన్ ప్రైమ్ వీడియో శుభ‌వార్త చెప్పింది. ఈ సినిమాని మార్చి 22 నుంచి హిందీ, తెలుగు, త‌మిళ బాష‌ల్లో స్ట్రీమింగ్ చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది. ఈ చిత్రంలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా కీలక కామియో రోల్ లో కనిపించగా యశ్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ నిర్మించింది.

Next Story