ప‌ఠాన్ ట్రైల‌ర్‌.. యాక్ష‌న్‌తో కుమ్మేశారు

Shah Rukh Khan Pathan movie trailer out.బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ న‌టిస్తున్న చిత్రం 'ప‌ఠాన్‌'.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  10 Jan 2023 1:09 PM IST
ప‌ఠాన్ ట్రైల‌ర్‌.. యాక్ష‌న్‌తో కుమ్మేశారు

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ న‌టిస్తున్న చిత్రం 'ప‌ఠాన్‌'. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో దీపిక ప‌దుకునే క‌థానాయిక. యశ్ రాజ్ ఫిల్మ్స్ పతాకంపై ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో జాన్ అబ్రహం కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నాడు. దాదాపు ఐదేళ్లు త‌రువాత షారుఖ్ న‌టిస్తుండ‌డంతో ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. ఇక ఈ చిత్రం జ‌న‌వ‌రి 25న ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

ఈ నేప‌థ్యంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది. ఇందులో భాగంగా నేడు ఈ చిత్ర ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసింది. తెలుగు వెర్షన్ ట్రైల‌ర్‌ను మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, తమిళ్ ట్రైలర్ ను కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ విడుద‌ల చేశారు. ట్రైల‌ర్ ఆద్యంతం ఆక‌ట్టుకుంది. జాన్ అబ్రహం ఒక పోలీస్ కార్ మీద రాకెట్ లాంచ్ బాంబు షూట్ చేయడంతో ట్రైల‌ర్ ప్రారంభ‌మైంది. ఒక టెర్రర్ టీమ్ ఇండియా మీద భారీ ఎత్తున ఎటాక్ చేయాలని ప్లాన్ చేస్తారు. ఈ విషయం తెలిసిన ఇంటిలిజెన్స్ గ్రూప్ అజ్ఞాతవాసంలో ఉన్న గూఢచారి 'పఠాన్' (షారుఖ్ ఖాన్)ను రమ్మంటుంది. అత‌డికి దీపికా అనే మ‌రో గూఢ‌చారి స‌హ‌క‌రిస్తోంది. ప‌ఠాన్ ఈ ప్రైవేటు టెర్ర‌రిస్ట్ గ్రూపును ఎలా అంతం చేశాడు అనేది సినిమా స్టోరీలా క‌నిపిస్తోంది. ట్రైలర్ మొత్తం యాక్షన్ తో నిండిపోయింది. మొత్తానికి ట్రైల‌ర్ సినిమాపై ఉన్న అంచ‌నాల‌ను పెంచేసింది.

Next Story