మీ అండ‌ర్ వేర్ క‌ల‌రేంటి అని అడిగిన నెటిజ‌న్‌.. షారుక్ స‌మాధానం అదుర్స్‌‌‌

Shah Rukh Khan answer to Fan. ఓ నెటిజ‌న్ మీ అండ‌ర్ వేర్ క‌ల‌రేంటి అని ప్ర‌శ్నించాడు.షారుక్ కూడా ‌త‌న‌దైన స్టైల్‌లో స‌మాధాన‌మిచ్చాడు.

By Medi Samrat  Published on  31 March 2021 8:16 PM IST
Shah Rukh Khan answer

బాలీవుడ్ బాద్‌షా షారుక్‌ఖాన్ ట్విట‌ర్ లో ఆస్క్ మీ ఎనీథింగ్ సెష‌న్ తో నెటిజ‌న్ల ముందుకొచ్చాడు. చాలా అరుదుగా ట్వీట్లు పెట్టే షారుక్‌.. ఇలా సడెన్‌గా సోష‌ల్ మీడియాలో అందుబాటులోకి వ‌చ్చేస‌రికి ఫ్యాన్స్ ఆనందంలో మునిగిపోతున్నారు. దీంతో ఇదే సువ‌ర్ణ‌వ‌కాశం అనుకున్న ఫ్యాన్స్ ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు.

అయితే.. సెల‌బ్రిటీ ఇచ్చిన అవ‌కాశాన్ని కొంత‌మంది మిస్ యూజ్ చేసుకుంటారు. ఏదో కొంటె ప్ర‌శ్న వేసి తిట్లు తిన‌డ‌మో.. క్లాస్ పీకుచ్చుకోవ‌డ‌మో జ‌రుగుతుంది. తాజాగా అలాంటిదే జ‌రిగింది. ఇక ఫ్యాన్స్ ప్ర‌శ్న‌లకు చ‌క‌చ‌కా స‌మాధానాలు ఇస్తున్న షారుక్ ఓ వింత ప్ర‌శ్న ఎదురైంది. ఓ నెటిజ‌న్ మీ అండ‌ర్ వేర్ క‌ల‌రేంటి అని ప్ర‌శ్నించాడు. అన్ని ప్ర‌శ్న‌ల‌తో పాటు షారుక్‌.. అండ‌ర్ వేర్ ప్ర‌శ్న‌కు కూడా ‌త‌న‌దైన స్టైల్‌లో స‌మాధాన‌మిచ్చాడు. ఇలాంటి క్లాసీ, విద్యావంతులైన ప్రశ్నల కోసం మాత్రమే నేను #asksrk సెష‌న్ చేస్తానంటూ చ‌మ‌త్క‌రించాడు షారుక్‌.


దీంతో ఆ ప్ర‌శ్న వేసిన‌‌ ఫ్యాన్ కు..‌ ఇత‌ర నెటిజ‌న్ల నుండి ట్వీట్ల తాకిడి మొద‌లైంది. ఒక్క ట్వీట్ తో సెల‌బ్రిటి అయిపోయావ్ అంటూ సెటైర్లు వేస్తున్నారు.




Next Story