'ఆర్ఆర్ఆర్' టీమ్ ఆస్కార్‌ను తీసుకుని రావాలంటున్న షారుఖ్.. మనోళ్లు ఫిదా..!

Shah Rukh Khan asks Ram Charan to let him touch the Oscar they win for RRR. బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ నటించిన తాజా చిత్రం 'పఠాన్' ట్రైలర్ మంగళవారం విడుదలైంది.

By Medi Samrat  Published on  10 Jan 2023 9:00 PM IST
ఆర్ఆర్ఆర్ టీమ్ ఆస్కార్‌ను తీసుకుని రావాలంటున్న షారుఖ్.. మనోళ్లు ఫిదా..!

బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ నటించిన తాజా చిత్రం 'పఠాన్' ట్రైలర్ మంగళవారం విడుదలైంది. తెలుగు ట్రైలర్‌ను రామ్ చరణ్ రిలీజ్ చేశాడు. ఇదిలావుంటే.. ప్రస్తుతం లాస్ ఏంజెల్స్‌లో 'ఆర్ఆర్ఆర్' మూవీని ప్రమోట్ చేస్తున్న చిత్ర బృందాన్ని ఉద్దేశిస్తూ షారుఖ్ ఓ ట్వీట్ చేశాడు. మూవీ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నప్పటికీ తన సినిమా ట్రైలర్ రిలీజ్ కోసం టైమ్ కేటాయించిన చరణ్‌కి కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాకుండా.. 'మీ 'ఆర్ఆర్ఆర్' టీమ్ ఆస్కార్ అవార్డు‌ను ఇంటికి తెచ్చినప్పుడు నన్ను ఒక్కసారి తాకనివ్వండి' అంటూ ట్విట్టర్ వేదికగా థాంక్స్ చెప్పాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.

షారుఖ్ ఖాన్ న‌టిస్తున్న చిత్రం 'ప‌ఠాన్‌'. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో దీపిక ప‌దుకునే క‌థానాయిక. యశ్ రాజ్ ఫిల్మ్స్ పతాకంపై ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో జాన్ అబ్రహం కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నాడు. దాదాపు ఐదేళ్లు త‌రువాత షారుఖ్ న‌టిస్తుండ‌డంతో ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. ఇక ఈ చిత్రం జ‌న‌వ‌రి 25న ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Next Story