భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం బయోపిక్‌ల హవా నడుస్తోంది. దాదాపు రెండు దశాబ్థాల పాటు భారత మహిళా క్రికెట్ కు సేవలందించిన ప్రముఖ క్రికెటర్ మిథాలీరాజ్ నిజ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'శబాష్ మిథు'. శ్రీజిత్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మిథాలీ పాత్రలో తాప్సీ పన్ను నటించింది. వయాకామ్ 18 స్టూడియోస్ పతాకంపై నిర్మించగా.. జులై 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ నేపథ్యంలోనే చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాల్లో వేగం పెంచింది. అందులో భాగంగా నేడు(సోమవారం) ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేసింది. మిథాలీ రాజ్ క్రికెటర్‌గా రాణించే క్రమంలో ఎదుర్కొన్న ఆటు పోట్లు గురించి ఇందులో చూపించారు. మహిళల క్రికెట్‌కు గుర్తింపు తీసుకురావడం కోసం ఆమె ఎంతలా శ్రమించింది. అనే విషయాలను ఈ చిత్రంలో చూపించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.'మెన్ ఇన్ బ్లూ లాగానే మనకి కూడా ఉమెన్ ఇన్ బ్లూ అనే టీమ్ ఉంటే బాగుంటుందని ఎనిమిదేళ్ల వయసు నుంచి కలలు కంటున్నాను' అని తాప్సీ చెప్పే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమవుతుంది. కొన్ని సన్నివేశాల్లో తాప్సీ నటన భావోద్వేగానికి గురి చేసేలా ఉన్నాయి. ఈ ట్రైలర్ ఆద్యంతం మనసుని హత్తుకునేలా ఉంది.