ఎమోషనల్ 'శాకుంతలం' ఈవెంట్

Shaakuntalam Trailer Launch Event. శాకుంతలం ట్రైలర్ రిలీజ్‌లో నటి సమంత భావోద్వేగానికి గురయ్యారు.

By M.S.R  Published on  9 Jan 2023 4:43 PM IST
ఎమోషనల్ శాకుంతలం ఈవెంట్

శాకుంతలం ట్రైలర్ రిలీజ్‌లో నటి సమంత భావోద్వేగానికి గురయ్యారు. గుణశేఖర్ మాట్లాడుతుండగా కన్నీటి పర్యంతమయ్యారు. తన జీవితంలో శాకుంతలం ఓ స్పెషల్‌ మూవీ అని చెప్పుకొచ్చారు సమంత. దర్శకుడు గుణశేఖర్‌, నిర్మాత దిల్‌రాజుకు ధన్యవాదాలు తెలిపారు. కాళిదాసు 5వ శతాబ్ధంలో రాసిన శాకుంతలం సినిమాకు గుణశేఖర్‌ తనను ఎంచుకోవడం తన అదృష్టం అని చెప్పుకొచ్చింది. జీవితంలో తాను ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నా.. సినిమా నన్ను ప్రేమించడం మాత్రం తగ్గలేదని తెలిపింది. శాకుంతలంతో ఈ ప్రేమ మరింత పెరుగుతుందని సమంత ధీమా వ్యక్తం చేసింది. 'శాకుంతలం' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు సమంత వచ్చింది. వైట్ కలర్ శారీలో, కళ్లజోడు ధరించి ఆమె కనిపించింది.


గుణశేఖర్ మాట్లాడుతూ .. 'శాకుంతలం' సినిమాలో ముగ్గురు హీరోలు ఉన్నారు. కథకి నాయకుడిగా దేవ్ మోహన్ హీరో అయితే .. సినిమాకి హీరో సమంత.. సినిమా వెనుక హీరో దిల్ రాజు ఉన్నారని అన్నారు. ఈ సినిమా క్రెడిట్ మాత్రం దిల్ రాజుగారికి ఇస్తున్నానని గుణశేఖర్ చెప్పుకొచ్చారు. ఎమోషన్ అయ్యానని.. మనలాంటివారు ఒక మాంచి సినిమా తీయాలంటే మంచి మేకర్స్ అవసరం. ఒక ఎమ్మెస్ రెడ్డి గారు, అశ్వనీదత్ గారు, దిల్ రాజు గారులాంటి వారు వెనుక ఉంటేనే మేము అనుకున్నది తీయగలమని అన్నారు గుణశేఖర్.


Next Story