నేను బతికే ఉన్నా.. వదంతులు నమ్మొద్దు: కోటా శ్రీనివాసరావు

ప్రముఖ తెలుగు సీనియర్‌ నటుడు కోటా శ్రీనివాసరావు మృతి చెందారంటూ సోషల్‌ మీడియాలో కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు.

By అంజి  Published on  21 March 2023 11:31 AM IST
Senior Actor Kota srinivasa rao, Tollywood news

నేను బతికే ఉన్నా.. వదంతులు నమ్మొద్దు: కోటా శ్రీనివాసరావు

ప్రముఖ తెలుగు సీనియర్‌ నటుడు కోటా శ్రీనివాసరావు మృతి చెందారంటూ సోషల్‌ మీడియాలో కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. హైదరాబాద్ లోని నివాసంలో ఆయన కన్నుమూసినట్లు ఆ వార్తల సారాంశం. ఈ వదంతులపై తాజాగా కోటా శ్రీనివాసరావు స్పందిస్తూ.. ఓ వీడియో రిలీజ్‌ చేశారు. సోషల్‌ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారంపై కోటా ఆవేదన వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం చెప్పిన కోటా.. ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని, వదంతులు నమ్మొద్దన్నారు. రేపు ఉగాది పండుగ కావడంతో ఆ ఏర్పాట్లలో ఉన్నానని క్లారిటీ ఇచ్చారు.

మనిషి ప్రాణాలతో ఆడుకోవద్దని, తప్పుడు ప్రచారం చేసిన వారికి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పాలని కోటా కోరారు. ఇవాళ ఉదయం నుంచి దగ్గరదగ్గర ఒక 50 ఫోన్‌ కాల్స్‌ మాట్లాడనని అన్నారు. తన మరణంపై వచ్చిన పుకార్లతో పోలీసులు కూడా తమ ఇంటికి వచ్చారని అన్నారు. తాను బతికే ఉన్నానని, తన అభిమానులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కోటా శ్రీనివాసరావు తెలిపారు. ఇలాంటి వార్తలు ఇచ్చే ముందు సరిచూసుకోవాలని మీడియాకు ఆయన విజ్ఞప్తి చేశారు. కోటా వీడియో రిలీజ్‌తో తప్పుడు ప్రచారం చేస్తున్న వారికి గట్టి షాక్‌ తగిలింది.

Next Story