ఆ ఫాస్ట్ బీట్ కు సల్మాన్ డాన్స్ చేయడానికి చాలా కష్టాలే పడ్డాడండోయ్..!

Seeti Maar Song In Salman Radhe Movie. సినిమా టీజర్ విడుదలైనప్పుడు దేవిశ్రీ ప్రసాద్ అల్లు అర్జున్ 'డీజే' సినిమాకు ఇచ్చిన 'సీటీ మార్' పాటను ఇందులో కూడా ఉంచారని క్లారిటీ వచ్చింది.

By Medi Samrat  Published on  26 April 2021 8:16 AM GMT
Seeti Maar Song

సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న సినిమా 'రాధే.. ది మోస్ట్ వాంటెడ్ భాయ్'. ఈ సినిమాకు ప్రభుదేవా దర్శకత్వం వహించాడు. ఇటీవల సినిమా టీజర్ విడుదలైనప్పుడు దేవిశ్రీ ప్రసాద్ అల్లు అర్జున్ 'డీజే' సినిమాకు ఇచ్చిన 'సీటీ మార్' పాటను ఇందులో కూడా ఉంచారని క్లారిటీ వచ్చింది. సీటీ మార్ సాంగ్ లో అల్లు అర్జున్ డాన్స్ సూపర్ అని చెప్పొచ్చు. ఇక రాధే సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ లో భాగంగా 'సీటీమార్' హిందీ వెర్షన్ ను విడుదల చేశారు. అయితే అంత ఫాస్ట్ బీట్ కు డాన్స్ చేయడానికి సల్లూ భాయ్ చాలా కష్టాలే పడ్డాడు. ఆయన వయసు, మేనరిజంతో బాగానే మేనేజ్ చేశారు. ఇక దిశా పటానీ మాత్రం డాన్స్ తో కేకపుట్టించేసింది. తెలుగు వాళ్లకు ఈ పాట అంతగా నచ్చకపోయినా.. హిందీ జనాలను బాగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది.


ఈ సినిమాను థియేటర్లలోనూ, ఓటీటీలలోనూ ఒకేసారి విడుదల చేయాలని భావిస్తోంది. మే13న సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన రాధే సినిమా అటు సినిమా థియేటర్ల లోనూ, ఇటు జీ ప్లెక్స్ లో చూడొచ్చు. పే పర్ వ్యూ ద్వారా సినిమాను ఇంట్లో కూర్చునే టీవీలో ఎంజాయ్ చేయొచ్చు. ఈ సినిమాలో జాకీ ష్రాఫ్, రణదీప్ హుడాలు కీలక పాత్రల్లో నటిస్తూ ఉన్నారు. సల్మాన్ ఖాన్ ఈ సినిమాలో డ్రగ్స్ మాఫియాను అడ్డుకునే పోలీసు ఆఫీసర్ పాత్రలో కనిపిస్తూ ఉన్నాడు. అతడి ప్రియురాలిగా దిశా పటానీ నటిస్తోంది.


Next Story