అభిమాని మ్యారేజ్ ప్రపోజల్.. మృణాల్ ఠాకూర్ షాకింగ్ రిప్లై
వైట్ డ్రెస్ ధరించి ఎంతో అందంగా చిరునవ్వులు చిందిస్తూ ఓ వీడియోనూ తన ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.
By అంజి Published on 28 Feb 2023 12:36 PM ISTNext Story
హీరోయిన్ మృణాల్ ఠాకూర్
'సీతారామం' సినిమాతో ఓవర్ నైట్ స్టార్‌గా మారింది హీరోయిన్ మృణాల్ ఠాకూర్. అంతకుముందు పలు సినిమాల్లో నటించినా పెద్దగా గుర్తింపు తగ్గించకోలేద. 'సీతారామం' మూవీతో ఒక్కసారిగా ఫుల్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా వైట్ డ్రెస్ ధరించి ఎంతో అందంగా చిరునవ్వులు చిందిస్తూ ఓ వీడియోనూ తన ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ వీడియో క్షణాల్లోనే వైరల్‌గా మారింది. ఈ క్రమంలోనే ఓ అభిమాని మృణాల్‌కు పెళ్లి ప్రపోజల్ చేశాడు.
''నిన్ను పెళ్లి చేసుకోవడానికి నా సైడ్ నుంచి ఓకే'' అంటూ వీడియోకు కామెంట్ చేశాడు. దీనిపై మృణాల్ ఫన్నీగా రిప్లై ఇచ్చింది. ''నిన్ను పెళ్లి చేసుకోవడానికి నా సైడ్ నుంచి మాత్రం ఒకే కాదు'' అంటూ సరదాగా రిప్లై ఇచ్చింది. మృణాల్ తన కామెంట్‌కు రిప్లై ఇవ్వడంతో అభిమాని సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. మృణాల్ ఇటీవల అక్షయ్ కుమార్, ఇమ్రాన్ హాస్మి ప్రధాన పాత్రలు పోషించిన 'సెల్ఫీ'లో అతిధి పాత్రలో కనిపించారు. రాజ్ మెహతా దర్శకత్వం వహించిన 'సెల్ఫీ' మూవీలో డయానా పెంటీ, ఇమ్రాన్ హష్మీ, నుష్రత్ భరుచ్చా కూడా నటించారు. ఫిబ్రవరి 24న థియేటర్లలో విడుదలైంది.