'ఆర్‌ఆర్‌ఆర్‌' నుంచి క్రేజీ అప్‌డేట్‌.. ఆ రోజు పూన‌కాలే

Second Single from RRR Movie on November 10th.సినీ అభిమానులు అంతా ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 Nov 2021 5:32 AM GMT
ఆర్‌ఆర్‌ఆర్‌ నుంచి క్రేజీ అప్‌డేట్‌.. ఆ రోజు పూన‌కాలే

సినీ అభిమానులు అంతా ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో 'ఆర్ఆర్ఆర్ ( రౌద్రం రణం రుధిరం )' సినిమా ఒక‌టి. ద‌ర్శ‌క‌దీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. అల్లూరి సీతారామరాజుగా మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చరణ్, గిరిజన వీరుడు కొమురం భీమ్ గా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ క‌నిపించ‌నున్న ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 7, 2022న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది. ఈ నేప‌థ్యంలోనే చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది. ఇప్ప‌టికే ఫస్ట్ లుక్స్, గ్లింప్స్, దోస్తీ సాంగ్ విడుద‌ల చేసింది.

తాజాగా రెండో పాట‌కు సంబంధించిన అప్‌డేట్‌ను ఇచ్చింది చిత్ర‌బృందం. 'నాటు నాటు' అంటూ సాగే ఈ పాట‌ను న‌వంబ‌ర్ 10న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించింది. ఇందుకు సంబంధించిన ఓ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేయ‌గా.. అది ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ పోస్ట‌ర్‌లో ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌లు ఇద్ద‌రూ చాలా స్టైలిష్‌గా డ్యాన్స్ చేస్తున్న‌ట్లుగా ఉంది. తెలుగుతో పాటు త‌మిళ‌, హిందీ, త‌మిళం, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ బాష‌ల్లోనూ ఈ చిత్రం విడుద‌ల కానుంది. కీర‌వాణి సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రాన్ని భారీ బ‌డ్జెట్ తో డీవీవీ దాన‌య్య నిర్మిస్తున్నారు. కీర‌వాణి సంగీతాన్ని అందిస్తుండ‌గా.. అలియా భ‌ట్‌, ఒలివియా మోరిస్‌, అజ‌య్ దేవ్‌గ‌ణ్‌, శ్రియా శ‌ర‌ణ్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

Next Story