సెబాస్టియన్ పీసీ 524 టీజర్.. రేచీకటి పోలీస్ కష్టాలు

Sebastian PC 524 teaser out.ఎస్ఆర్ క‌ళ్యాణ మండపం ఫేమ్ కిర‌ణ్ అబ్బ‌వ‌రం హీరోగా న‌టిస్తున్న చిత్రం సెబాస్టియన్ పీసీ 524.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 Feb 2022 3:24 PM IST
సెబాస్టియన్ పీసీ 524 టీజర్.. రేచీకటి పోలీస్ కష్టాలు

'ఎస్ఆర్ క‌ళ్యాణ మండపం' ఫేమ్ కిర‌ణ్ అబ్బ‌వ‌రం హీరోగా న‌టిస్తున్న చిత్రం 'సెబాస్టియన్ పీసీ 524'. బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో నమ్రతా దారేకర్ - కోమలి ప్రసాద్‌లు హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఈ చిత్రంలో కిర‌ణ్‌.. రేచీక‌టితో బాధ‌ప‌డే పోలీసు కానిస్టేబుల్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. తాజాగా ఈ చిత్ర టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు.

'నీకు రేచీకటి అన్న విషయం ఎవ్వరికీ తెలియనివ్వద్దు అయ్యా' అని హీరో తల్లి చెప్పడంతో ఈ టీజర్ మొదలవుతుంది. నైట్ డ్యూటీ చేస్తున్నప్పుడు ఎలాంటి కేసు రాకూడదని కోరుకుంటుంటాడు సెబాస్టియన్. అయితే.. తనకున్న రేచీకటి లోపాన్ని ఎవరికీ తెలియకుండా దాచిపెట్టడంతో ఎటువంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చిందనే ఆసక్తికరమైన కథాంశంతో కామెడీ థ్రిల్లర్ ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. ఇక ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి 25వ తేదీన ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. తెలుగు, తమిళ భాషలలో ఈ చిత్రం విడుదల కానుంది. ఆదర్శ్ బాలకృష్ణ, రోహిణి, శ్రీకాంత్ అయ్యంగార్, జార్జ్, సూర్య, మహేష్ విట్టా, రవితేజ, రాజ్ విక్రమ్, లత, ఇషాన్, రాజేష్, శివ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Next Story