'అఖిల్' హీరోయిన్ తల్లి అయ్యింది

Sayesha Saigal gives birth to baby girl.అఖిల్ చిత్రంతో టాలీవుడ్‌లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది సాయేషా సైగ‌ల్‌.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 July 2021 7:29 AM GMT
అఖిల్ హీరోయిన్ తల్లి అయ్యింది

'అఖిల్' చిత్రంతో టాలీవుడ్‌లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది సాయేషా సైగ‌ల్‌. అయితే ఇక్క‌డ పెద్ద‌గా స‌క్సెస్ కాక‌పోవ‌డంతో త‌మిళంలో న‌టిస్తూ మంచి పేరు తెచ్చుకుంది. ఆర్యతో సినిమా చేస్తున్న సమయంలో ఆయనతో ప్రేమలో పడింది. ఇద్దరి మద్య వయసు వ్యత్యాసం చాలా ఎక్కువ అయినా కూడా వారి ప్రేమను పెద్దలు ఒప్పుకున్నారు. దీంతో 2019లో మార్చి 10న పెళ్లిచేసుకున్నారు. తాజాగా వీరికి పండంటి ఆడ‌బిడ్డ జ‌న్మించింది. ఈ విష‌యాన్ని హీరో విశాల్ ట్వీట్ చేశాడు.

'ఈ వార్తను రివీల్ చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. నా సోదరుడు ఆర్య, సాయేషా ఆడబిడ్డకు జన్మనిచ్చారు. అంకుల్‌ను అయినందుకు హ్యాపీ. షూటింగ్ మధ్యలో చెప్పలేని అనుభూతి కలిగింది. ఆర్య తండ్రిగా కొత్త బాధ్య‌త‌లు తీసుకున్నాడు. బిడ్డకు దేవుడి ఆశీర్వాదం ఉండాలి' అంటూ విశాల్‌ ట్వీట్ చేశాడు.

కాగా, ఆర్య, విశాల్‌ కలిసి ప్రస్తుతం 'ఎనిమీ' సినిమాలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ హైదరబాద్‌లో జరుగుతుంది. నేనే అంబానీ, రాజా రాణి వంటి చిత్రాల‌తో ఆర్య తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితుడే. కాగా.. ఆయ‌న న‌టించిన సార్ప‌ట్ట చిత్రం ఇటీవ‌ల ఓటీటీలో విడుద‌లైంది. గురువారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం మంచి విజ‌యాన్ని అందుకుంది.

ఆర్య, సాయేషా దంపతులు పాపకు జన్మనిచ్చిన సందర్బంగా నెటిజన్స్ పెద్ద ఎత్తున అభినందనలు తెలియజేస్తున్నారు.


Next Story
Share it