3 వారాలకే ఓటీటీలో సర్కారు వారి పాట స్ట్రీమింగ్‌

Sarkaru Vaari Paata streaming on Amazon Prime Video.సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు న‌టించిన స‌ర్కారు వారి పాట చిత్రం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 Jun 2022 5:44 PM IST
3 వారాలకే ఓటీటీలో సర్కారు వారి పాట స్ట్రీమింగ్‌

సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు న‌టించిన 'స‌ర్కారు వారి పాట' చిత్రం మే 12న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. బాక్సాఫీస్ వ‌ద్ద ఈ చిత్రం కాసుల వ‌ర్షం కురిపించింది. దాదాపు రూ.200కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది. ఇక ఈ చిత్రం ఎప్పుడెప్పుడు ఓటీటీలో విడుద‌ల అవుతుందా అని సినీ అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా వారికి అమెజాన్ ప్రైమ్ శుభ‌వార్త చెప్పింది. ఈ చిత్రం విడుదలైన మూడు వారాల‌కే త‌మ ఓటీటీలో అందుబాటులోకి తీసుకువ‌చ్చిన‌ట్లు ప్ర‌క‌టించింది.

అయితే.. ఇక్క‌డ ఓ చిన్న ట్విస్ట్ ఉంది. ఈ చిత్రాన్ని ఉచితంగా చూసేందుకు వీలులేదు. ఈ సినిమాని చూడాలంటే రూ.199 చెల్లించాల‌ని పేర్కొంది. ఒక‌సారి అద్దెకు తీసుకున్న త‌రువాత 30 రోజుల పాటు వ్యాలిడిటీ ఉంటుంది. మ‌రొక విష‌యం ఏంటంటే.. ఒక‌సారి సినిమా చూడ‌డం మొద‌లు పెట్టిన త‌రువాత 48 గంట‌ల్లో గ‌డువు పూర్తి అవుతుంది. అంటే.. న‌గ‌దు చెల్లించి ఒక‌సారి సినిమా చూడ‌డం మొద‌లుపెట్టిన త‌రువాత 48 గంట‌ల్లో చూసేయాలి. కాగా.. ఇప్పటికే కేజీయఫ్‌-2ను ఇదే విధానంలో అందుబాటులో తెచ్చింది అమెజాన్‌.

పరశురామ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మ‌హేష్ స‌ర‌స‌న కీర్తి సురేష్ న‌టించింది. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు తమన్‌ సంగీతం అందించారు.

Next Story