మ‌హేష్ అభిమానుల‌కు స‌ర్‌ప్రైజ్.. 'స‌ర్కారు వారి పాట' టైటిట్ సాంగ్ వ‌చ్చేసింది

Sarkaru Vaari Paata movie title song out.సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు న‌టిస్తున్న చిత్రం స‌ర్కారు వారి పాట‌. ప‌ర‌శురామ్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  23 April 2022 11:59 AM IST
మ‌హేష్ అభిమానుల‌కు స‌ర్‌ప్రైజ్.. స‌ర్కారు వారి పాట టైటిట్ సాంగ్ వ‌చ్చేసింది

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు న‌టిస్తున్న చిత్రం 'స‌ర్కారు వారి పాట‌'. ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో మ‌హేష్ స‌ర‌స‌న కీర్తి సురేష్ న‌టిస్తోంది. మే 12న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల‌ను మొద‌లుపెట్టింది. అందులో భాగంగా నేడు(శ‌నివారం) ఈ చిత్ర టైటిల్ సాంగ్‌ను విడుద‌ల చేసింది.

'సరా సరా సర్కారు వారి పాట... షురూ షురూ అన్నాడురా అల్లూరి వారి బేటా...'అంటూ ఈ పాట సాగుతోంది. అనంత శ్రీరామ్ రాసిన లిరిక్స్ అందించ‌గా.. హారికా నారాయ‌ణ్ ఈ పాట‌ను ఆల‌పించారు. థ‌మ‌న్ సంగీతాన్ని అందించాడు. కొద్ది సేప‌టి క్రిత‌మే విడుద‌లైన ఈ పాట ప్ర‌స్తుతం యూట్యూబ్‌లో దూసుకుపోతుంది.

ప్రముఖ నిర్మాణ సంస్థలు జీఏంబీ ఎంటర్‌టైన్‌మెంట్, మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌‌లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మ‌హేష్‌.. పొడ‌వాటి జుట్టు, మెడ‌పై రూపాయి టాటూతో మాస్ లుక్‌లో క‌నిపించ‌నున్నాడు.

Next Story