మహేష్ అభిమానులకు పండగే.. సర్కారు వారి పాట నుంచి క్రేజీ అప్‌డేట్
Sarkaru Vaari Paata first single release on February 14.సూపర్ స్టార్ మహేష్‌బాబు నటిస్తున్న చిత్రం సర్కారు వారి పాట
By తోట వంశీ కుమార్ Published on
26 Jan 2022 5:16 AM GMT

సూపర్ స్టార్ మహేష్‌బాబు నటిస్తున్న చిత్రం 'సర్కారు వారి పాట'. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం నిజానికి సంక్రాంతికి విడుదల కావాల్సి ఉండగా.. కొన్ని కారణాల వల్ల సమ్మర్‌కి వాయిదా పడింది. మహేష్ సరసన కీర్తి సురేశ్ నటిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. జీఎంబి ఎంటర్ టైన్మెంట్, మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ పతాకాలపై ఈ చిత్రాన్ని మహేశ్ బాబు, నవీన్ యెర్నేని, వై రవి శంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్ర అప్‌డేట్ కోసం మహేష్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు వారి ఎదురుచూపులు ఫలించాయి.
గణతంత్ర దినోవత్సవం సందర్భంగా మహేష్ అభిమానులకు చిత్ర బృందం శుభవార్త చెప్పింది. ఈ సినిమా నుంచి మొదటి పాటను ప్రేమికుల రోజున విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. థమన్ పోస్టర్ తో అప్‌డేట్‌ను విడుదల చేశారు. దీంతో మహేష్ అభిమానులు పుల్ ఖుషీ అవుతున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం ఏప్రిల్ 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
Next Story