ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా 'సర్దార్‌' టీజర్‌.. అదరగొట్టిన కార్తీ

Sardar Telugu official teaser out.హీరో కార్తి వ‌రుస చిత్రాల‌తో పుల్ బిజీగా ఉన్నాడు. అందులో ఒక‌టి 'స‌ర్దార్‌'.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 Sept 2022 12:13 PM IST
ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా సర్దార్‌ టీజర్‌.. అదరగొట్టిన కార్తీ

హీరో కార్తి.. పరిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం లేదు. త‌మిళంతో పాటు తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయ‌న న‌టించిన చిత్రాలు త‌మిళంతో పాటు తెలుగులోనూ ఏక కాలంలో విడుద‌ల అవుతుంటాయి. ప్ర‌స్తుతం కార్తి వ‌రుస చిత్రాల‌తో పుల్ బిజీగా ఉన్నాడు. అందులో ఒక‌టి 'స‌ర్దార్‌'. 'అభిమ‌న్యుడు' ఫేం పీఎస్‌.మిత్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో స్పై థ్రిల్లర్ మూవీగా తెర‌కెక్కుతోంది. ఈ చిత్రం దీపావ‌ళి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

ఈ నేప‌థ్యంలోనే చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది. అందులో భాగంగా ఈ చిత్ర టీజ‌ర్‌ను హీరో సూర్య చేతుల మీదుగా చిత్ర బృందం విడుద‌ల చేయించింది. ఇండియ‌న్ మిల‌ట‌రీ కాన్ఫిడెన్షియ‌ల్ రూమ్‌లోకి ఎంట‌ర్ అయ్యాడు. ఇండియ‌న్ మిల‌ట‌రీ ర‌హ‌స్యాల‌న్నీ అందులోనే ఉన్నాయి. ఆ ర‌హ‌స్యాలు బ‌య‌ట‌కు వ‌స్తే మొత్తం అయిపోయిన‌ట్లే అన్న డైలాగ్‌తో టీజ‌ర్ ప్రారంభ‌మైంది. కార్తి ప‌లు విభిన్న గెట‌ప్స్‌లో క‌నిపించ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. జి.వి ప్ర‌కాశ్ కుమార్ అందించిన నేప‌థ్య సంగీతం ఆక‌ట్టుకుంటోంది. ప్ర‌స్తుతం ఈ టీజ‌ర్ యూట్యూబ్‌లో దూసుకుపోతుంది.

ఈ చిత్రంలో రజిషా విజయన్, రాశి ఖన్నా, చంకీ పాండే, లైలా, సిమ్రాన్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులో అన్న‌పూర్ణ స్టూడియోస్ సంస్థ విడుద‌ల చేస్తుంది.

Next Story