'సారంగ‌ద‌రియా' పాట‌కు సాయి ప‌ల్ల‌వి స్టెప్పులు అదుర్స్

Saranga Dariya song out.అక్కినేని నాగ‌చైత‌న్య‌, సాయి ప‌ల్ల‌వి జంట‌గా న‌టిస్తున్న చిత్రం ల‌వ్ స్టోరి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 Feb 2021 5:54 AM GMT
Saranga Dariya song out

అక్కినేని నాగ‌చైత‌న్య‌, సాయి ప‌ల్ల‌వి జంట‌గా న‌టిస్తున్న చిత్రం 'ల‌వ్ స్టోరి'. సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినిమాస్ మరియు అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నారాయణ దాస్ కె.నారంగ్ పుష్కర్, రామ్మోహన్ రావ్ నిర్మాతలుగా ఉన్నారు. శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం ఏప్రిల్ 16న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈనేప‌థ్యంలో చిత్రబృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది. ఈ చిత్రానికి సంబంధించి ఒక్కో పాట‌ను విడుద‌ల చేస్తూ మూవీపై అంచ‌నాల‌ను పెంచేస్తోంది. తాజాగా 'సారంగ దరియా' అంటూ సాగిపోయే పాట‌ను విడుద‌ల చేశారు.

ఈ పాట‌ను స‌మంత ట్విట్ట‌ర్‌లో విడుద‌ల చేసింది. సుద్దాల అశోక్ తేజ అందించిన సాహిత్యానికి గాయ‌ని మంగ్లీ మ్యాజిక్ వాయిస్ తోడ‌వ‌డంతో మ‌రోసారి వినాల‌నిపించేంత అద్భుతంగా పాట ఉంది. ఈ మాస్ బీట్‌కు సాయి ప‌ల్ల‌వి అదిరిపోయే స్టెప్పులు వేసింది. ఈ పాట‌తో పాటు సాయి ప‌ల్లవి ప‌ర్‌ఫార్మెన్స్ ప్ర‌తి ఒక్క‌రిని ఆక‌ట్టుకుంటుంది. ఏఆర్ రహమాన్ శిష్యుడు పవన్ సంగీతాన్ని అందించిన ఈ పాట విన్న‌వాళ్లు స్టెప్పులు వేసేంత ఊపునిస్తుంది. ఈ చిత్రంలో ఇద్దరు డ్యాన్సర్ల జీవన శైలిని చూపించనున్నారు.


Next Story
Share it