సాయి పల్లవి డ్యాన్స్ చేస్తే.. రికార్డుల మోతే..!

Saranga dariya song.'సారంగ దరియా' సాంగ్ లిరిక్స్ కు సాయి పల్లవి డాన్స్ తోడవ్వడంతో కేవలం 32 రోజుల్లోనే 100 మిలియన్ వ్యూస్ సాధించి సరికొత్త రికార్డు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 April 2021 10:52 AM GMT
Sai Pallavi Saranga Dariya Song

సాయి పల్లవి.. డ్యాన్స్ చేస్తే నెమలి నాట్యమాడినట్లు ఉంటుందని ఊరికే చెప్పలేదు. ఇప్పటికే అమ్మడి వీడియో సాంగ్స్ యూట్యూబ్ లో భారీ హిట్స్ అయ్యాయి. తాజాగా సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన లవ్ స్టోరీ సినిమాలోని 'సారంగదరియా' లిరికల్ వీడియో భారీ హిట్ అయ్యింది. 'సారంగ దరియా' సాంగ్ లిరిక్స్ కు సాయి పల్లవి డాన్స్ తోడవ్వడంతో కేవలం 32 రోజుల్లోనే 100 మిలియన్ వ్యూస్ సాధించి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. సౌతిండియాలో మరే లిరికల్ సాంగ్ ఇంత తక్కువ టైమ్‌లో 100 మిలియన్ వ్యూస్ మార్క్ చేరుకోలేదు. అల్లు అర్జున్ 'బుట్ట బొమ్మ' సాంగ్ కూడా 'సారంగ దరియా' దెబ్బకు వెనుకపడింది. ఫిబ్రవరి 28న ఆదిత్య మ్యూజిక్ ఛానల్‌లో అప్‌లోడ్ అయిన 'సారంగ దరియా' పాట తొలి రోజు నుంచే శ్రోతలను ఆకట్టుకుని, మిలియన్ల కొద్ది వ్యూస్ అందుకుంటూ వచ్చింది.

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించారు. రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని ఇతర కీలక పాత్రలు పోషించారు. ఏప్రిల్ 16న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా సినిమాను నిర్మించాయి. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించగా కె నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్రావు నిర్మాతలుగా వ్యవహరించారు.
Next Story
Share it