'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా ఈ సంక్రాంతికి పెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 200 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ చిత్రం కేవలం 6 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల షేర్ క్లబ్‌లో చేరింది. ఇప్పుడు మరో భారీ మైలురాయిని సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం 100 కోట్ల షేర్ క్లబ్‌లో చేరింది. ఈ క్లబ్‌లో చేరిన మొదటి మీడియం-బడ్జెట్ చిత్రంగా ఇది నిలిచింది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ కామెడీ-ఎంటర్‌టైనర్ కు వీకెండ్స్ లోనే కాదు.. సాధారణంగా కూడా మంచి కలెక్షన్స్ లభిస్తున్నాయి.
మేకర్స్ ఈ సినిమాకు చివరి నిమిషంలో OTT డీల్ కుదుర్చుకున్నారు. ఈ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పుడు సంక్రాంతికి వాస్తున్నాం సినిమా OTT స్ట్రీమింగ్ పార్ట్నర్ ను ధృవీకరించారు. ఈ చిత్రం OTT, శాటిలైట్ హక్కులను జీ గ్రూప్/ZEE5 మంచి ధరకు కొనుగోలు చేసింది. సంక్రాంతికి వస్తున్నాం సినిమా థియేటర్లలో మంచి రన్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమా 6 వారాల తర్వాత ఓటీటీలో ఎంట్రీ ఇస్తుందని భావిస్తున్నారు. ఫైనల్ రన్‌లో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 250 కోట్ల గ్రాస్ మార్క్‌ను టచ్ చేయడానికి సిద్ధంగా ఉంది.