కేజీఎఫ్‌ చాప్టర్ 2.. సంజయ్ దత్ న్యూ లుక్ రిలీజ్.. వైర‌ల్

Sanjay Dutt new look released from KGF Chapter 2.సిని అభిమానులంతా ఆస‌క్తిగా ఎద‌రుచూస్తున్న చిత్రాల్లో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  29 July 2021 11:54 AM IST
కేజీఎఫ్‌ చాప్టర్ 2.. సంజయ్ దత్ న్యూ లుక్ రిలీజ్.. వైర‌ల్

సిని అభిమానులంతా ఆస‌క్తిగా ఎద‌రుచూస్తున్న చిత్రాల్లో 'కేజీఎఫ్‌ చాప్టర్ 2' ఒక‌టి. ఎలాంటి అంచ‌నాలు లేకుండా ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో క‌న్న‌డ స్టార్ హీరో య‌శ్ న‌టించిన కేజీఎఫ్ చిత్రం ఎంత‌టి ఘ‌న విజ‌యం సాధించిందో అంద‌రికి తెలిసిందే. ఈ మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కిస్తున్న కేజీఎఫ్‌ చాప్టర్‌ 2 భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఆ అంచ‌నాల‌ను మ‌రింత పెంచుతూ.. చిత్ర బృందం ఎప్ప‌టిక‌ప్పుడు స‌ర్‌ప్రైజింగ్ అప్‌డేట్‌ల‌ను ఇస్తోంది. కాగా.. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ సంజ‌య్ ద‌త్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.

నేడు సంజ‌య్ ద‌త్ పుట్టిన రోజు సంద‌ర్భంగా 'కేజీఎఫ్ 2'లో అధీరాగా విలన్ పాత్ర చేస్తున్న ఆయ‌న న్యూ లుక్‌ను చిత్ర బృందం విడుద‌ల చేసింది. చేతిలో భారీ ఖడ్గం పట్టుకొని ఎంతో పవర్‌ఫుల్‌గా కనిపిస్తున్న సంజయ్‌ లుక్‌ విపరీతంగా ఆకట్టుకుంది. ప్ర‌స్తుతం ఈ ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. యష్, సంజయ్ దత్ భారీ యాక్షన్ సన్నివేశం ఉందని, ఇది ప్రేక్షకులను ఎంతో థ్రిల్‌కు గురి చేస్తుందని ఇప్పటికే మేకర్స్‌ వెల్లడించారు. పాన్ ఇండియా లెవ‌ల్‌లో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాదిలోనే ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌చ్చేందుకు సన్నాహాకాలు చేస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ చిత్ర విడుద‌ల తేదీని చిత్ర‌బృందం వెల్ల‌డించనుంది.

Next Story