సందీప్ వంగా దర్శకత్వంలో మహేష్, తమన్నా

Sandeep Vanga to direct Mahesh Babu and Tamannah.సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ గ్యాప్‌లో మ‌హేష్ అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో నటించబోతున్నాడు

By తోట‌ వంశీ కుమార్‌
Published on : 16 March 2021 2:52 PM IST

Sandeep Vanga to direct Mahesh Babu and Tamannah

సూపర్ స్టార్ మహేష్ బాబు న‌టిస్తున్న తాజా చిత్రం 'సర్కారు వారి పాట'. ఇటీవ‌లే ఫ‌స్ట్ షెడ్యూల్ స‌క్సెస్‌పుల్‌గా పూర్తి చేసుకుంది చిత్ర‌బృందం. త్వ‌ర‌లోనే రెండో షెడ్యూల్‌ను ప్రారంభించే ప‌నిలో ఉన్నారు చిత్ర నిర్మాత‌లు. అయితే.. ఈ గ్యాప్‌లో మ‌హేష్ అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో నటించబోతున్నాడు. ఈ వార్త తెలిసేసరికి సూపర్ స్టార్ అభిమానులలో ఎన్నడూ లేని ఆసక్తి నెలకొంది. కాగా.. మహేష్, సందీప్ కలిసి చేయబోయేది సినిమా కాదు. అదొక యాడ్ ఫిల్మ్. మ‌హేష్‌బాబు ఇప్ప‌టికే ప‌లు బ్రాండ్ల‌కు అంబాసిడ‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే.

రీసెంట్‌గా మహేష్ ఖాతాలో మరో కొత్త బ్రాండ్ వచ్చి చేరింది. పాపులర్ హోమ్ అప్లయెన్సెస్ సంస్థ హావెల్స్‌ (Havells) కు మహేష్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. ఇందులో భాగంగా మహేష్, తమన్నాలపై సందీప్ డైరెక్షన్‌లో యాడ్ షూటింగ్ చేస్తున్నారు. మంగళవారం తమన్నాతో కలిసి మహేష్ షూటింగ్‌లో పాల్గొన్నారు. త్వరలోనే ఈ యాడ్ ఫిల్మ్ టీవీలో రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే..మహేష్ 'సర్కారు వారి పాట', తమన్నా 'ఎఫ్ 3', సందీప్ హిందీలో రణ్‌బీర్ కపూర్‌తో 'యానిమల్' సినిమాలతో బిజీగా ఉన్నారు.




Next Story