'మైఖేల్‌' ఫస్ట్‌లుక్‌.. అదిరిపోయింది

Sandeep Kishan’s stunning first look poster for ‘Michael’ released.విజ‌యాలు, ప‌రాజ‌యాల‌తో సంబంధం లేకుండా విభిన్న

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 May 2022 1:26 PM IST
మైఖేల్‌ ఫస్ట్‌లుక్‌.. అదిరిపోయింది

విజ‌యాలు, ప‌రాజ‌యాల‌తో సంబంధం లేకుండా విభిన్న చిత్రాల‌ను ఎంచుకుంటూ ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్న యంగ్ హీరో సందీప్ కిష‌న్‌. ఆయ‌న న‌టిస్తున్న తాజా చిత్రం 'మైఖేల్'. రంజిత్ జేయకొడి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో సందీప్ స‌ర‌స‌న దివ్యాంక కౌశిక్ న‌టిస్తోంది. శ్రీ వెంక‌టేశ్వ‌రా సినిమాస్ ఎల్ఎల్‌పి, క‌ర‌ణ్ సి ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ల‌పై పుస్కుర్‌ రామ్‌మోహ‌న్ రావు, భ‌ర‌త్ చౌద‌రీలు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఈ రోజు సందీప్ కిష‌న్ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా చిత్ర బృందం సందీప్‌కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది. ఈ పోస్ట‌ర్‌లో సందీప్ సిక్స్ ప్యాక్ బాడీతో చేతిలో గ‌న్ ప‌ట్టుకుని చాలా సిరీయ‌స్ లుక్‌లో క‌నిపిస్తున్నాడు. విజ‌య్ సేతుప‌తి, గౌత‌మ్ వాసుదేవ మీన‌న్‌, వరలక్ష్మి శరత్‌కుమార్, వరుణ్ సందేశ్‌లు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తుండ‌డంతో ఈ చిత్రంపై భారీ అంచ‌నాలే ఉన్నాయి. అందుకు త‌గ్గ‌ట్లుగానే ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. తెలుగుతో పాటు, హిందీ, తమిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల్లో విడుద‌ల కానుంది. ఈ చిత్రంతో పాటు మ‌రో రెండు రెండు సినిమాల‌ను లైన్లో పెట్టాడు సందీప్ కిష‌న్‌.

Next Story