కేజీఎఫ్ నటుడు 'ఛా ఛా' కన్నుమూత
కేజీఎఫ్ నటుడు హరీశ్ రాయ్ కన్నుమూశారు. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన..
By - అంజి |
కేజీఎఫ్ నటుడు 'ఛా ఛా' కన్నుమూత
కేజీఎఫ్ నటుడు హరీశ్ రాయ్ కన్నుమూశారు. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారు. కేజీఎఫ-1లో హరీశ్ రాయ్.. ఛాఛా అనే పాత్రలో నటించారు. రెండో పార్ట్ రిలీజైన నాటికే ఆయన క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. అది నాలుగో స్టేజీకి చేరడంతో పూర్తిగా బక్కచిక్కిపోయారు. ఆర్థిక సాయం చేయాలని కోరగా నటుడు ధ్రువ్ సర్జా హెల్ప్ చేశారు. పరిస్థితి చేజారిపోవడంతో ఆయన మరణించారు.
కన్నడ సినిమా రంగంలో విలన్ పాత్రలు ఎక్కువ పోషించారు. 'ఓం', 'నల్ల', 'కేజీఎఫ్', 'కేజీఎఫ్ 2' వంటి అనేక ఇతర కన్నడ చిత్రాలలో విలన్ గా నటించిన హరీష్ రాయ్ క్యాన్సర్ తో బాధపడ్డారు. నటుడు యష్ తో సహా చాలా మంది హరీష్ రాయ్ కు ఆర్థికంగా సహాయం చేశారు. నిర్మాత ఉమాపతి శ్రీనివాస్, దర్శన్ అభిమానులు, అనేక మంది నటులు, నటీమణులు హరీష్ రాయ్‌కు ఆర్థిక సహాయం అందించారు. నటుడు యష్ కూడా గతంలో తనకు సహాయం చేశారని హరీష్ రాయ్ పేర్కొన్నారు. కానీ చివరకు హరీష్ ఈరోజు కన్నుమూశారు.
హరీష్ రాయ్ 90ల కాలంలో అనేక సినిమాల్లో విలన్ గా మెరిశాడు. నిజానికి తన నిజ జీవితంలో కూడా హరీష్ రాయ్ ఒక కేసులో జైలు పాలయ్యాడు. దర్శన్ జైలుకు వెళ్ళినప్పుడు, హరీష్ రాయ్ తన జైలు రోజులను గుర్తుచేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు. హరీష్ రాయ్ కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
హరీష్ రాయ్ కన్నడలోనే కాకుండా తమిళ సినిమాల్లో కూడా నటించారు. అతను అండర్ వరల్డ్, మిందుం ఒరు కాదల్ కాదై, రాజ్ బహదూర్, సంజు వెడ్స్ గీత, స్వయంవర, భూగత, నాన్న ఒధూంబో హూవే, నల్లా, జాఫర్ అలియాస్ ముర్గి జాఫర్, జోడి హక్కి, తాయవ్వ, ఓం, శాండల్‌వుడ్ యొక్క అగ్ర చిత్రాల KGF చాప్టర్ 2 KGF చాప్టర్ 2 చిత్రాలలో నటించాడు.