డ్రగ్స్ కేసు.. కన్నడ హీరోయిన్లకు ఊహించని షాక్..!

Sandalwood Drug case hair test confirms drugs consumed by sanjjanaa and ragini.కర్ణాటకలో సంచలనం రేపిన డ్రగ్స్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 Aug 2021 2:00 PM GMT
డ్రగ్స్ కేసు.. కన్నడ హీరోయిన్లకు ఊహించని షాక్..!

కర్ణాటకలో సంచలనం రేపిన డ్రగ్స్ కేసులో కన్నడ హీరోయిన్స్ పేరు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే..! ఆయా హీరోయిన్లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించి రిమాండ్ కు కూడా తరలించారు. కొద్దిరోజుల తర్వాత బెయిల్ పై విడుదలయ్యారు. తాజాగా వారి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. హీరోయిన్లు రాగిణి ద్వివేది, సంజనలు డ్రగ్స్ సేవించినట్టు ఎఫ్.ఎస్.ఎల్. రిపోర్ట్ తేల్చేసింది. 2020 అక్టోబర్ లో ఇద్దరి వెంట్రుక నమూనాలను ఎఫ్.ఎస్.ఎల్ కు బెంగుళూరు పోలీసులు పంపారు. ఈ రిపోర్టులో వారు డ్రగ్స్ తీసుకున్నట్టు తేలింది.

మొదట బ్లడ్, యూరిన్ నమూనాలను వీరి నుండి సేకరించి ల్యాబ్ కు పంపిన పోలీసులు, వాటిలో ఫలితం సరిగ్గా తేలకపోవడంతో వెంట్రుకల నమూనాలను సేకరించారు. రాగిణి, సంజన ల వెంట్రుకల నమూనాలను హైదరాబాద్‌ నగరం లోని ఎఫ్ ఎస్ ఎల్ కు పంపారు. పరిశోధనల్లో డ్రగ్స్ సేవించినట్టు రిపోర్ట్ వచ్చింది. దీంతో మరోసారి ఇద్దరికీ సమన్లు జారీ చేయనున్నారు బెంగుళూరు పోలీసులు. హైదరాబాద్ లోని ఫోరెన్సిక్ రిపోర్టుతో హీరోయిన్లతో పాటు అందరూ డ్రగ్స్ సేవించారని వెలుగు చూసిందని క్రైమ్ బ్రాంచ్ అడిషనల్ పోలీసు కమీషనర్ సందీప్ పాటిల్ స్పష్టం చేశారు.

Next Story